Kamal hassan political satire movie planning gossips

kamal hassan news, kamal hassan political movie, kamal hassan gossips, kamal hassan vishwaroopam movie, vishwaroopam movie updates

kamal hassan political satire movie planning gossips : the rumours going viral about kamal hassan that he is planning a movie with political satire story.

రాజకీయాలపై కమల్ వ్యంగ్యాస్త్రాలు...

Posted: 03/04/2015 03:46 PM IST
Kamal hassan political satire movie planning gossips

విలక్షణ నటుడు కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీపై గతంలో ఎన్నో రూమర్లు వచ్చాయి. ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశాలున్నాయని వార్తల మీద వార్తలొచ్చేశాయి. అయితే.. తాను రాజకీయాల్లోకి రానంటూ ఆ రూమర్లను ఒక్కసారిగా బద్దలుకొట్టేశారు కమల్! ఇక అప్పటినుంచి ఆ ఊసే ఎత్తని ఆయన.. ఇప్పుడు రాజకీయాలపైనే వ్యంగ్యస్త్రాలు చేస్తున్నారట! అయితే.. ఇది రియల్ లైఫ్ లో కాదులెండి, రీల్ లైఫ్ లో!

ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఉత్తమవిలన్’, ‘పాపనాశం’, ‘విశ్వరూపం-2’ మూవీల్లో నటిస్తున్నారు. వీటిలో ‘ఉత్తమవిలన్’ షూటింగ్ పూర్తికాగా.. ‘పాపనాశం’, ‘విశ్వరూపం-2’ మూవీల చిత్రీకరణలు చివరిదశకు చేరుకున్నాయి. ఈ మూవీ షూటింగుల్లో బిజీగా వున్న కమల్.. అప్పుడే మరో రెండు సినిమాలు ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.

వీటిలో ఒకటి థ్రిల్లర్ కథాంశంతో తమిళంలో రూపొందనుంది. ఇక రెండోది పూర్తిస్థాయి హిందీ చిత్రాన్ని కమల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ హిందీ చిత్రం సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలతో సాగుతుందని యూనిట్ వర్గాలవారు అంటున్నారు. అయితే.. వీటికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  vishwaroopam 2  uttama villain  

Other Articles