Pawan kalyan political entry movie new janasena party officials tollywood gossips

pawan kalyan news, pawan kalyan gossips, pawan kalyan political entry, pawan kalyan movie news, pawan kalyan movies, pawan kalyan dasari, pawan kalyan charan, pawan kalyan ram charan, pawan kalyan productions

pawan kalyan political entry movie new janasena party officials tollywood gossips : The rumours are going in tollywood that pawan will leave his movie career while he is busy in political way.

అభిమానులకు పవన్ ‘పరీక్ష’? డైలామాలో రిజల్ట్!

Posted: 03/03/2015 12:14 PM IST
Pawan kalyan political entry movie new janasena party officials tollywood gossips

గత సార్వత్రిక ఎన్నికల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాలు దూరంగా వుంటూ.. సినిమాలమీదే ఎక్కువ దృష్టి సారించారు. అయితే.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆంధ్రరాష్ట్ర రాజధానిపై రైతులు ఆందోళనలు వ్యక్తం చేయడంతోపాటు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కేటాయించలేదు. దీంతో ‘‘అన్యాయం జరిగిన ప్రతిచోటా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి తాను ముందుకు వస్తానంటూ చెప్పిన పవన్.. ఇప్పుడు ఎందుకు మిన్నకుండిపోయారంటూ ఆయన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రాజధానికి చెందిన గ్రామాలప్రజలు, రైతులు ప్లకార్డులతో పవన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో.. ఆయన మళ్లీ రాజకీయ ఆరంగేట్రం చేయక తప్పలేదు.

ఈ నేపథ్యంలో పవన్.. బీజేపీ-టీడీపీ కూటమిపై ట్విటర్ వేదికగా ఇటీవలే ప్రశ్నలదాడి మొదలపెట్టారు. అలాగే సెంట్రల్ బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు తక్కువగా బడ్జెట్ కేటాయించడంపై చంద్రబాబు నాయుడుతో కలిసి చర్చలు కూడా జరిపారు. ఇప్పుడు మార్చి 8వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించనున్న ప్రాంతంలో పర్యటించనున్నారు. అక్కడ పర్యటించి రాజధాని నిర్మాణంలో భాగంగా ఆ ప్రాంతంలోని రైతులు, మిగతా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనున్నారనే విషయాలపై పవన్ చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన తర్వాత పవన్ కేంద్రంతో కలిసి స్పెషల్ స్టేటస్ విషయంపై చర్చలు జరిపే అవకాశముందని సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

దీంతో పవన్ వేస్తున్న స్టెప్స్ గమనిస్తుంటే.. ఆయన సినిమాలు వదిలేసి, తన ‘జనసేన’ పార్టీతో ఫుల్ టైం పొలిటీషియన్ లా ప్రజల్లోకి రానున్నాడా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రశ్నే సినీ, రాజకీయ రంగాల్లో ఎంతో ఆసక్తికరంగా మారింది. అటు ఆయన అభిమానులు కూడా పవన్ ఇక సినిమాల్లోకి రాకపోవచ్చేమోనన్న బెంగతో వున్నారని తెలుస్తోంది.

నిజానికి పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2′ ని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. దీంతోపాటు దాసరి ప్రొడక్షన్ లో ఓ సినిమాకి కమిట్ అవడంతోపాటు తన నిర్మాణ సంస్థ చరణ్ హీరోగా మూవీ తీస్తున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. అంటే.. పవన్ మరో రెండేళ్లు తన మూవీ కెరీర్ ని కంటిన్యూ చేస్తాడు కానీ.. ఎక్కువగా రాజకీయాలకే సమయాన్ని కేటాయించడంపై ఆయన సినీ కెరీర్ మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే.. పవన కల్యాణే స్పందించాల్సి వుంటుంది!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan politics  dasari narayana rao  ram charan  chandrababu naidu  

Other Articles