Cm kcr is silent on polavaram issue questions dk aruna

dk aruna fire on cm kcr, dk aruna fire on kcr, dk aruna fire on Telanganacm kcr, DK Aruna Sensational Comments on CM KCR, congress party, trs party,Telangana CM KCR.

DK Aruna Fires on Telangana CM KCR, Why CM KCR is silent on Polavaram issue questions DK, KCR is silent on Polavaram issue questions DK Aruna,

కేసిఆర్ దొర!..నాదీ తెలంగాణే! తోలుతీస్తా బిడ్డా!

Posted: 07/18/2014 04:50 PM IST
Cm kcr is silent on polavaram issue questions dk aruna

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు రోజు రోజు తెలంగాణ లో శత్రువు సంఖ్య పెరిగిపోతున్నారు. అంటే రాజకీయ శత్రువులు. సహజంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు .. ఒక్కరిపై మాటల యుద్దం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు.. ఏకంగా.. సీఎం కేసిఆర్ పై ..మీసాలు మెలేసీ , తొడకొట్టేవారు ఎక్కువుతున్నారు.

సీఎం కేసిఆర్ సారుకు ..అధికారం ఉందని కదా అని .. హైదరబాద్ సిటీని ..ఆగం ఆగంచేస్తున్నాడు. గీ ముఖ్యమంత్రి కి ఏం పని పాట లేదా ఏదీ? గరీబోళ్ల బతుకులను ఆగం చేస్తున్నాడని ..కాంగ్రీసోళ్లు.. పొద్దుకాల నుండి సందేల వరకు మీడియా మైకులు ముందు గోల గోల చేస్తున్నారు. ఏందీ కేసిఆర్ దొర, మీ పద్దతి మాకు నచ్చలేని తెలంగాణ కాంగ్రీసు నాయకురాలు మాజీ మంత్రి డికె. అరుణ దైర్యం చేసి..సీఎం పై కయ్యానికి కాలుదువ్వుతుంది. తెలంగాణలో.. కేసిఆర్ పై కామెంట్ చేయటానికి రాజకీయ నేతలు జంకుతున్న సమయంలో డికె. అరుణ.. మాటల తూటాలు పేల్చారు.

అసలే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓడిన భయం పట్టుకుంది. అధికారం పార్టీ పై ఏ కామెంట్ చేస్తే..అది కాంగ్రెస్ పార్టీ దెబ్బకొడుతుందనే భావనలో.. అందరు అన్నీ ముసుకొని కూర్చున్న సమయంలో..డికే అరుణ.. దైర్యం చేసి, సీఎం ముఖ్యమంత్రి ఘాటైన కామెంట్లు చేయటం జరిగింది. పోలవరం ఆర్డినెన్స్ పై అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదని ఢికే అరుణ కేసిఆర్ ను నిలదీసింది.

రాష్ట్ర విభజన కావలని ఫైట్ చేసింది ఇందుకోసమే కేసిఆర్ అంటూ..ఆమె ప్రశ్నించింది. నీవల్ల తెలుగు ప్రజలు రెండుగా విడిపోయి బాగుపడిందేమిటి? పది జిల్లాలు కావాలని ..రాజకీయ కుట్రలు కుతంత్రాలు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారం సంపాదించుకున్నావు. పది జిల్లాలు కోసం పైట్ చేసి, ఇప్పుడు ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం అవుతుంటే.. ఏసీ రూమ్ లో కూర్చోని.. హాయిగా కాళ్లు ఊపుకుంటే.. ఎంజాయ్ చేస్తున్నావా! అంటూ డికే అరుణ్ సీఎం కేసిఆర్ నిలదీసింది. కేవలం రాజకీయ పదవి కోసమే.. తెలుగు ప్రజలు విడదీసి, ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఆంద్రప్రదేశ్ లో కలుపుతుంటే..ఎందుకు పెదవి విప్పలేదని అరుణ ప్రశ్నించారు.

మీ పాలన తుగ్లక్ పాలన అని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అంటున్నారు. అంటే నీలో ఇంకా ..మోనార్క్ లక్షణాలు ఇంకా ఉన్నాయని .. నీ రాజకీయ గురువే చెబుతుంటే.. నిజమే అని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. తెలంగాణ రాక ముందు.. తెలంగాణ కోసం బలి త్యాగాలు చేస్తే, మీ అధికారంలోకి వచ్చిన తరువాత, తెలంగాణ కుటుంబాలు రోడ్డున పడి, రైతులు , ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బంగారు తెలంగాణ తెస్తానని అంటున్నారు.

ఇక్కడ మా బతుకులు ఆగమవుతున్నాయి దొర అని తెలంగాణ ప్రజలు గెంతెత్తి అడుగుతున్న పట్టించుకునే నాథుడే లేకుండపోయిందని.. ఆమె మండిపడ్డారు. రాబోయే రోజుల్లో.. తెలంగాణ పాలన కంటే.. సమైక్య పాలనే మంచిగుందనే రోజలు వస్తాయని ..డికె అరుణ చెప్పటం జరిగింది. తెలంగాణ ప్రజలకు మేం న్యాయం చేస్తాం, మాకు అధికారం లేకపోయిన, కేసిఆర్ పాలనపై. పోరు చేయటానికి నేను సిద్దమే అంటూ.. డికే అరుణ సిద్దమైంది. దీంతో డికే అరుణ దైర్యానికి ..తెలంగాణ ప్రజలు, ఆమె అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles