Microsoft corporation layoffs of 18 000 employees begin

microsoft announces biggest-ever job cut, 18000 employees, satya nadella job-cuts, microsoft employees, mobility, cloud, microsoft, nokia, smartphones, tablets, leadership, windows phone, Microsoft Cuts, Microsoft Lay Off Workers, Video, Layoffs, Microsoft, Microsoft Lay Offs, Microsoft 18000 Jobs, Microsoft Job Cuts, Lay Offs

Microsoft has announced the biggest layoffs in its history, saying it will cut up to 18,000 jobs or 14 percent of its staff as it works to cut down on management layers and integrate the Nokia cellphone business it bough microsoft-corporation layoffs of 18000 employees begin, Microsoft is eliminating 18,000 jobs over the next year, including about 12,500 associated with the Nokia Devices and Services team it acquired, Microsoft is eliminating 18,000 jobs over the next year, including about 12,500 associated with the Nokia Devices and Services team it acquired, Satya Nadella's job-cuts memo to Microsoft employees

18 వేలమంది లైప్ లో చీకటి నింపుతున్న మైక్రోసాప్ట్!

Posted: 07/18/2014 03:15 PM IST
Microsoft corporation layoffs of 18 000 employees begin

ప్రపంచలోనే అతి పెద్ద సంస్థ మైక్రోసాప్ట్, మా అబ్బాయి మైక్రోపాస్ట్ ఉద్యోగి అని చెప్పుకొని.. ఆనందపడిన తల్లిదండ్రులను మనం చూసే ఉంటాం. కానీ ఇకనుండి అలా కాదు.. మా అబ్బాయి జీవితంలో మైక్రోసాప్ట్ సంస్థ చీకటి నింపింది అని చెప్పుకునే తల్లిదండ్రులు తయరవుతారు. 39 ఏళ్ల చరిత్రలో ఎన్నడు జరగని విధంగా ఉద్యోగుల పై వేటు వేయటానికి మైక్రోసాప్ట్ సంస్థ సిద్దంగా ఉంది.

రాబేయే సంవత్సరం వ్యవధిలో 18 వేల మేర సిబ్బందిని తొలగించనున్నట్లు కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఈ చర్యలు కఠినమైనవే అయినా... కొద్ది నెలల క్రితం కొనుగోలు చేసిన నోకియా మొబైల్ డివైస్‌ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌తో అనుసంధానించేందుకు ఇవి తప్పనిసరి అని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో ఆయన పేర్కొన్నారు. తమకు భారత్‌లో నోకియా డివెజైస్‌తోసహా 6,500 మంది ఉద్యోగులు ఉన్నారని.. మైక్రోసాఫ్ట్ సిబ్బంది పునర్‌వ్యవస్థీకరణ ప్రభావం చాలా చాలా స్పల్పంగానే ఉంటుందని చెప్పారు.

microsoft-job-cuts

అంతేకాకుండా ఈ 18,000 కోతల్లో సుమారు 12,500 వరకూ నోకియా డివెజైస్ అండ్ సర్వీసెస్ బిజినెస్‌కు చెందిన నిపుణలు, ఫ్యాక్టరీ సిబ్బందివే ఉంటాయని సమాచారం. ప్రధానంగా మైక్రోసాఫ్ట్, నోకియా డివెజైస్‌ల మధ్య సిబ్బంది పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. తొలి విడతలో భాగంలో 13,000 సిబ్బందిని తగ్గించుకునే చర్యలను ప్రారంభించామని... వచ్చే ఆరు నెలల్లో ఎవరిని తొలగించబోతున్నామనేది ప్రకటిస్తామని నాదెళ్ల వెల్లడించారు.

microsoft-18000-jobs

అయితే రానున్న 12 నెలల్లో పన్ను ముందస్తు చార్జీల రూపంలో 1.6 బిలియన్ డాలర్లను అంటే రూ.9,600 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. సత్య నాదెళ్ల ఐదు నెలల క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి సిబ్బంది ఉధ్వాసన ప్రకటన కావడం గమనార్హం. అయితే, భారత్ చాలా కీలకమైన మార్కెట్‌గా నిలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగాల కోతలు పెద్దగా ఉండకపోవచ్చ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles