Telangana movie producer dil raju says telangna cinema to cm kcr

dil raju says telangna cinema to cm kcr, telangana movie producer dil raju, ovie producer dil raju , telangana cm kcr, telangana actors, telangana cinema.

telangana movie producer dil raju says telangna cinema to cm kcr

సిఎం కేసిఆర్ కు దిల్ రాజ్ జవాబు?

Posted: 06/21/2014 12:06 PM IST
Telangana movie producer dil raju says telangna cinema to cm kcr

తెలంగాణ బడా నిర్మాత అయిన దిల్ రాజు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకు ఆయన సినిమాలోకంలో బతికి, ఒక్కసారి ..రాజకీయల వైపు అడుగు పెట్టాడు. అంటే రాజకీయల్లో రావటం లేదు గానీ, తెలంగాణ రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి, అన్నీ కొత్తగా ఉండాలని దిల్ రాజు కోరుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి టాలీవుడ్ నుండి ఒక బలమైన జవాబు ఇవ్వటం జరిగింది.


ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి తెలంగాణ నిర్మాతలు, హీరోలు, నటులు, దర్శకులు చేయలేని సాహజం దిల్ రాజు చేశాడు. మొన్నటి వరకు దిల్ రాజుఆంద్రవాళ్లికి సపోర్టు చేస్తున్నాడని తెలంగాణ నటులు, దర్శకులు నుండి విమర్శలు వచ్చాయి. కానీ వాటిని పెద్దగా దిల్ రాజు పట్టించుకోలేదు. అయితే ఈరోజు మాత్రం దిల్ రాజు నేరుగా సిఎం కేసిఆర్ కు ఒక నివేదిక పంపించాడు. తెలంగాణ సినిమా బాగుపడాలంటే తెలంగాణ సర్కార్ ఇవి తప్పనిసరిగా చేయాలని దిల్ రాజు కేసిఆర్ కు పంపించిన నివేదికలో చెప్పటం జరిగింది.

తెలంగాణలో తెలంగాణ కళాకారులకు 100శాతం అవకాశాలివ్వాలి. ఎవరెక్కడికైన పొండి మాకనవసరం, ముందు మా తెలంగాణ కళాకారుల ట్యాలెంట్ ను గుర్తించాల్సిందే. 24 శాఖల్లో అర్జెంట్ గా తెలంగాణ వారికి సగం అవకాశాలివ్వాల్సిందేనని తెలంగాణ కళాకారులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇటీవల ఏపీ ఫిలింఛాంబర్ పేరును.. తెలుగు ఫిలింఛాంబర్ మార్చటం జరిగింది. అయితే ఇప్పుడు సడన్ గా దిల్ రాజుతెరపైకి వచ్చాడు. సినిమా అనేది బిజినెస్. తీసిన సినిమాను బిజినెస్ చేసుకోకపోతే.. నిర్మాత భారీగ నష్టపోతాడు. అంతేకాదు.. పర్సంటేజీ బేస్ లో ఆర్టిస్టుకి ఛాన్సులివ్వడం అసలు కుదరదని దిల్ రాజు గట్టిగానే చెప్పారు. అసలు తెలంగాణ సినిమా బాగుపడాలంటే.. ముఖ్యంగా.. తెలంగాణలో ఫిలింస్కూల్స్ తెరవాలి. తెలంగాణ కళాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కేసిఆర్ సర్కార్ కు చెప్పటం జరిగింది.

అంతేకాదు.. తెలంగాణలో టాలెంట్ ఉన్న వారు చాలా మంది ఉన్నారు. తెలంగాణ దర్శకులు వంశీపైడిపల్లి, హరీష్ శంకర్ లాంటి వారి టాలెంట్ చూసి సినిమా ఛాన్సులిచ్చారు. అంతేకాదు సినిమా థియేటర్ లీజు వ్యవస్థను రద్దు చేస్తానంటే మొదటగా సంతకం చేయడానికి నేను రెఢీగా ఉన్ననని దిల్ రాజు చెప్పటం జరిగింది.

హైదరాబాద్ లో ఉన్న సినిమా థియేటర్లలో 22 మాత్రమే నా చేతిలో ఉన్నాయని దిల్ రాజు దైర్యంగా సిఎం కేసిఆర్ కు నివేధిక ఇవ్వటం జరిగింది. ఇప్పుడు సిఎం కేసిఆర్ తెలంగాణ కళాకారులకు ఎలా న్యాయం చెయాలో అనేది ఆయన చేతిలోనే ఉంది. ఇక దిల్ రాజు జవాబుతో కేసిఆర్ ఎలాంటి అడుగులు వేస్తాడో చూడాలి.

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles