ఆంద్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు ..కరెంట్ షాక్ కొట్టింది. ఇప్పటి వరకు నీటి యుద్దాలు, ప్రాంత యుద్దాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త కరెంట్ యుద్దం తెలుగు రాష్ట్రాల మద్య మొదలైంది. రాష్ట్ర విభజన సమయంలో అన్ని సమానంగా పంపకాలు చేసిన కేంద్రం కరెంట్ విషయంలో మాత్రం తెలంగాణకు 53.49 శాతం ఇచ్చిన ఆంద్రప్రదేశ్ కు 46.51 శాతం కరెంట్ ఇవ్వటం జరిగింది. దీంతో ఆంద్రప్రదేశ్ కు భారీ నష్టం జరిగిందని భావించిన ఆంద్రపదేశ్ గవర్నర్ మెంట్ స్పందించి లేఖల ద్వారా తమ బాధను బయట పెట్టింది.
దీంతో తెలంగాణ ప్రభుత్వం ఎలర్ట్ అయ్యింది. ఎపీజెన్ కో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) నుండి వైదొలుగుతూ ఏపీ సర్కార్ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు విద్యుత్ ఒప్పందాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రం సూచించింది.
''రాష్ట్ర విభజన జరిగినప్పుడు అన్ని రంగాల్లో అని కూలంగా ప్రతికూలంగా అవకాశం లేదు. ఎపి జెన్ కో ప్రాజెక్టు గతంలో కేటాయించిన 54 శాతం తెలంగాణకు 46 సీమాంధ్రకు అన్నారు. ఏ ప్రాతిపదికన చేశారో సహేతుకంగా లేదు. జనాభా నిష్పత్తి ప్రకారం చేశారు. అటు పదమూడు జిల్లాలు, ఇటు పది జిల్లాల్లో వాస్తవ డిమాండ్ ఎంత ? విద్యుత్ కోతలు విధించారో ప్రపోషనేట్ గా ఉంటే బాగుంటుంది.
హైదరాబాద్, రంగారెడ్డిలలో నామమాత్రంగా కోతలు విధించి ఇతర ప్రాంతాల్లో అదనంగా కోతలు చేశారు. చట్టబద్ధంగా పిపిఎలంటూ ఏవి లేవు. లేని పిపిఎలు కొనసాగుతాయా అనేది ప్రశ్న. పిపిఎలు ఉసంహరించుకుంటామని దాని ప్రకారం 2810 మెగావాట్లు సీమాంధ్రకు లభిస్తుంది. హైడెల్ ప్రాజెక్టు ఇదే వర్తిస్తుంది. పిపిఎలు కొనసాగుతాయని చట్టబద్ధంగా ఎది చెల్లుతుందనేది న్యాయవ్యవస్థ నిర్ణయం తీసుకుంటుంది.
రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నా అధిక ధరకు కొనుగోలు చేస్తున్నా మేము చెప్పిన నిష్పత్తి ప్రకారం ఇతర రాష్ట్రాలకు కేటాయించాలి. ఇది ఫెడరల్ స్పూర్తికి భిన్నంగా జరుగుతుంది. కేంద్రం జోక్యం చేసుకున్నా రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలి. మధ్యలో ఎవరో వచ్చి స్టే ఇచ్చే అధికారం లేదు.
జల వివాదాలు ఉంటే బోర్డు పెట్టారు. విద్యుత్ రంగంలో విద్యుత్ వివాదాలు సామరస్యంగా ఆలోచించాల్సినవసరం ఉంది. వాస్తవ డిమాండ్ ప్రకారం రెండు రాష్ట్రాలకు విభజించాలి. కేంద్ర ప్రభుత్వాల నయా ఉదారావాద విధానాల వల్లే తీవ్రమైన సమస్య వచ్చింది. అసలు విధానాలు పక్కకు పోతాయి. ప్రజానుకూల విధానాలు అవలింబించాలి''.
ఈ వ్యవహారం కేంద్ర పరిధిలోకి వెళ్లి అక్కడి నుంచి స్టేటస్ కో ఉత్తర్వులు కూడా జారీ అయిపోయాయి. కానీ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతల మధ్య మాత్రం వాడి...వేడి మాటల యుద్ధాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. పీపీఏను ఉపసంహరించుకునే అంశంపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. ‘మాట్లాడితే సమ న్యాయం...తెలుగు ప్రజలు అంటారు.
తెలంగాణ వారు తెలుగువారు కాదా? పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. వారు అసెంబ్లీని కూడా ఇక్కడే నిర్వహిస్తారు. దానికి విద్యుత్తు అవసరం లేదా? ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు, దగ్గర నుంచి మంత్రులు, డీజీపీ వంటి ఉన్నతాధికారుల ఆఫీసులు కూడా ఇక్కడే. మరి వారికి కరెంటు వద్దా?' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరి అవలంభిస్తే... చాలా రంగాల్లో తామూ ఆలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను ఉపసంహరించుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర పునర్విభజన చట్టానికి విరుద్ధమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పునర్విభజన చట్టాన్ని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అనైతికమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో తెలంగాణకు 460 మెగావాట్ల విద్యుత్తు లోటు ఏర్పడనుందన్నారు. అయినా భయపడాల్సిన పని లేదని, దానికి అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి హరీష్ చెప్పుకొచ్చారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more