Sonia gandhi asked to ys jagan help me

sonia gandhi asked to ys jagan help, Jagan, Sonia Gandhi, Lok Sabha Opposition Party, Ysrcp Merge With Congress, Congress party, ysrcp.

sonia gandhi asked to ys jagan help me

జగన్ రెడ్డిగారు.. నాకు సాయం చెయ్యండి? సోనియా గాంధీ

Posted: 06/05/2014 06:42 PM IST
Sonia gandhi asked to ys jagan help me

ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రాణం పోసుకోవాలంటే. కొన్ని సంవత్సరాలు గాల్సిందే. అయితే ముందుగా సోనియా గాంధీ రంగంలో్కి దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఢిల్లీ లోని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కోసం నానా తంటాలు పడుతోంది. మొత్తం పార్లమెంట్ సభ్యుల్లో 10 శాతం సభ్యులు (52) ఉంటేనే ఒక పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం 44 సీట్లలో గెలుపొందింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కని దుస్థితి ఏర్పడింది.

అయితే సోనియా గాంధీ ముందు చూపుతో.. జగన్ పార్టీని విలీనం చేసుకుంటే..భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి కొంచెం బలం చేకూరుతుందని ఆలోచించి.. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతను రాయభారం పంపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జగన్ రెడ్డి సాయం కోసం సోనియా గాంధీ ఎదురుచూస్తుంది.

వైకాపాకు ఉన్న ఎనిమిది సీట్లను కలుపుకుంటే తమకు ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం జగన్‌తో కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత ఒకరు రాయబారం నడుపుతున్నట్టు సమాచారం.

అయితే జగన్ మాత్రం సోనియా పంపిన నేతలతో.. కొంచెం ఇష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు అధికారం లేదు కాబట్టి.. కొంచెం వెనకడుగు వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీలోని సినియర్ నాయకులు అంటున్నారు. అయితే ఈ ఇద్దరి మద్య నడుస్తున్న రాయబారం కొన్ని రోజల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles