Political leaders targets trs chief kcr

TRS Chief KCR, Political Leaders, Political Leaders Targets TRS, Political Leaders Targets TRS Chief KCR, congress party, tdp, bjp, ysrcp, election 2014, telangana state, telangana election.

Political Leaders Targets TRS Chief KCR

కేసిఆర్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

Posted: 04/26/2014 10:25 AM IST
Political leaders targets trs chief kcr

నిజాయితీ గల నాయకుడు, తెలంగాణ తెచ్చిన వీరుడు, మాటల మాంత్రికుడు, అపరచాణ్యుడు అయిన కేసిఆర్ ను రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి. కేసిఆర్  చేసిన తప్పేంటి?  ఆయన లో లోపం ఏమిటి? తెలుగు ప్రజలకు, కొంత మంది రాజకీయ  నేతలకు ఇష్టమైన నాయుకుడి పై  కామెంట్లు, తిట్లు, శాపనార్థాలు ఎందుకు పెడుతున్నారు?  అనే ప్రశ్నలు  చదువుకున్న యువకులకు, సామాన్యా ప్రజలకు కలుగుతున్నాయి. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన  తరువాత కూడా ..కేసిఆర్ పై  రాజకీయ నేతలు ఎందుకు మండిపడుతున్నారు?  అంటే రాజకీయ మేథావులు కొన్ని సమాధానాలు బయటపెడుతున్నారు. ఆయన నిజంగా తెలంగాణ అభివ్రు ద్ది కోరుకునే నేత అయితే కుటుంబ పాలనకు తెరతీయ్యకుండా ఉండాల్సింది.  అలాగే.. పదే పదే ఆంధ్రా వారి రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేయకుండా సోదరబావం చూపిస్తే బాగుండేది?  అంతేకాకుండా రాజకీయ పదవులపై వ్యామోహం లేదంటే.. తన కుటుంబలోని  నలుగుర్ని ఎన్నికల బరిలోకి   దించటమే ఆయన పెద్ద తప్పు చేశారు. 

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ  రాజకీయ పదవులు ఆశ చూపించినప్పటికి  ‘‘టీజేసీ ఛైర్మన్ ఫ్రొ. కోదండరాం     నాకు పదవులు వద్దు తెలంగాణ ప్రజల అభివ్రుద్ది ముఖ్యం’’ అని   కాంగ్రెస్ పార్టీ అధినేతకు సున్నితంగా తిరస్కరించారు. ఇక్కడ నిజమైన తెలంగాణ కోసం ఉద్యమం చేసిన తెలంగాణ బిడ్డగా.. ప్రొ. కోదండరాం కనిపిస్తున్నారు. అదే బాటలో..కేసిఆర్ కూడా చేసి ఉంటే.. ఇలాంటి  ఉడుతూపులాంటి విమర్శలకు తావుండేది కాదని  రాజకీయ మేథావులు అంటున్నారు. 

ఇంకా ఇలాంటి చిన్న చిన్న తప్పులు చాలా చేసి  తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కేసిఆర్ దూరమవుతున్నారు.   అందరు  తెలంగాణలో దొర పాలన వస్తుందని అంటున్నారు. అసలు దొర అంటే అర్థం తెలిసిన వారు ఎవరు  కేసిఆర్ పై కామెంట్ చేయారని  రాజకీయ మేథావులు అంటున్నారు. 

అసలు దొర అంటే  తెలుగు పర్యాయ పద నిఘంటువులో ఉంటుంది. దొర అంటే శ్రేష్టుడు, దిట్ట, మేటి, గొప్పవాడు, ఉన్నతుడు, ఘనుడు, మహత్తరుడు, అధిపతి, అధినేత, పాలకుడు, సేనా నాయకుడు, మొనగాడు, సరివాడు.   ఇన్నీ గుణాలు ఉన్న కేసిఆర్.. ఎన్నికల సమయంలో వ్యక్తిగత, రాజకీయ విమర్శలు, మాట తప్పుట లాంటి చేసి, మీ పరువు తీసుకోవద్దని.. రాజకీయ అభిమానులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లే..కేసిఆర్ లో గొప్ప మార్పు వస్తుందని తెలుగుప్రజలు ఎదురుచూస్తున్నారు. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles