Telugu actor shivaji call for voters

Actor Shivaji, bjp leader Shivaji, shivaji press meet, election, voters, telugu Actor Shivaji call for voters, bjp leaders, congress party.

telugu Actor Shivaji call for voters

ఈ సారి చెప్పుతో కొట్టండి – నటుడు శివాజీ

Posted: 04/21/2014 04:31 PM IST
Telugu actor shivaji call for voters

ఈసారి మాత్రం చెప్పుతో కొట్టండని  నటుడు శివాజీ  ప్రజలకు పిలుపునిచ్చారు. రీసెంట్ గా రాజకీయల్లోకి అడుగు పెట్టిన యువ నటుడు శివాజీ.  అవినీతి, అన్యాయం పై  ప్రజల తరుపున పోరాటం చేస్తున్న వ్యక్తిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. 

పాలెం బస్సు సంఘటన ద్వారా  మీడియాలో కనిపించిన  నటుడు శివాజీ, బిజేపి పార్టీలో చేరిన విషయం తెలిసిందే.  అవినీతి నాయకులపై, అవినీతి రాజకీయ పార్టీలపై  శివాజీ  న్యాయ పోరాటం చేయటానికి బీజేపిలో చేరినట్లు తెలుస్తోంది. ఓటు హక్కు గురించి మాట్లాడుతూ.. డబ్బు కోసం విలువైన ఓటును వృధా చేసుకోవద్దని ఏ రాజకీయనాయకుడైన ఓటు కోసం ధనాన్ని ఎరచూపితే చెప్పుతో కొట్టమని పిలుపునిచ్చారు.

నిత్యం హైదరాబాద్ లో ఉండే మన నాయకులు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో ఆ ప్రాంతాలలో ఉండగలరా అంటూ నిలదీశారు. ప్రజలు డబ్బులు తీసుకుని ఓటు వేయరాదన్నారు. ఒకవేళ ఎవరైనా ధనాన్ని ఇస్తే ఫోన్ లో రికార్డు చేసి ఈసీకి పిర్యాదు చేయమన్నారు. 

ప్రలోభాలకు లొంగని నేతలను నిజాయితీగా గెలిపించమన్నారు. ఈ నెల 27న తెలంగాణలో, సీమాంధ్రలో ఎన్నికలకు రెండు రోజుల ముందు ఓటును అమ్ముకోవద్దంటూ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

అయితే శివాజీ వ్యాఖ్యలతో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు మండిపడుతున్నారు.  చెప్పుతో కొట్టమని పిలుపునిచ్చిన శివాజీ ముందుగా ఆయన పార్టీ నాయకులను కొట్టాలని అంటున్నారు.  ఒకవేళ శివాజీ వ్యాఖ్యలను పాటిస్తే.. మాత్రం జైలుకు వేళ్లతారని ..కొంతమంది రాజకీయ నాయకులు బహిరంగంగానే అంటున్నారు.  శివాజీ వ్యాఖ్యలు  యువతపై చేడు ప్రభావం చూపే విధంగా ఉందని  బిజేపిలోని సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. 

కొంత మంది రాజకీయ నాయకులు మాత్రం  శివాజీ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు.  ఇక్కడ నిర్ణయం తీసుకుకోవాల్సింది ప్రజలు.  జరగబోయే ఎన్నికల్లో శివాజీ వ్యాఖ్యలు  ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి.  అయిన ఈరోజు నిజాయితీగల నాయకులను, ఓటు హక్కును అమ్ముకోని ఓటర్లను చూడాలంటే.. టార్చీలైట్ వేసి వేతకాల్సిందే....

ఆర్ఎస్  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles