Jagan affidavit shows only rs 416 crores

Jagan affidavit shows only Rs.416 crores, YSRCP President YS Jagan, Lotus pond, YS Jagan assets

Jagan affidavit shows only Rs.416 crores

జగన్ లక్షకోట్లు, కార్లు ఏమైపోయాయి?

Posted: 04/21/2014 04:17 PM IST
Jagan affidavit shows only rs 416 crores

ఎన్నికలకి నామినేషన్ వేసిన సందర్భంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యుక్షుడు వైయస్ జగన్ సమర్పించిన అఫడవిట్ ప్రకారం జగన్ ఆస్తులు 343 కోట్ల రూపాయలు.  అందులో ఆయనకి సొంత కారు లేదు.  ఆయన స్థిరాస్తులు రూ.30 కోట్లయితే చరాస్తులు రూ.313 కోట్లట.  ఆయన భార్య పేరుమీద ఉన్న స్థిరాస్తులు రూ.14 కోట్లు, చరాస్తులు రూ.57 కోట్లు.  అంటే ఇద్దరి ఆస్తులు చర స్థిరాస్తులు కలిసి రూ.416 కోట్లు మాత్రమే.

జగన్ అక్రమంగా సంపాదించారని అన్ని కేసులు పెట్టి అంత దర్యాప్తు చేసి లక్షకోట్లకి, అఫిడవిట్ లో వివరాలకు పొంతన లేదు మరి.  మనకు లభించే జగన్ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి-

ఇడి అటాచ్ చేసిన ఆస్తులే దాదాపు రూ.1000 కోట్ల విలువ చేసేవి ఉన్నాయి.  అలాంటప్పుడు 416 కోట్ల రూపాయలనే చూపించటమేమిటని (తెదేపా నాయకుడు యనమల రామకృష్ణుడు లాంటి) కొందరి ప్రశ్న.  అయితే జప్తు చేసినవి కంపెనీలలో పెట్టిన వాటాదార్ల వాటాలు.  అవి జగన్ వి ఎలా అవుతాయి అన్నది కొందరి ఎదురు ప్రశ్న.  అయితే, జగన్ పేరు మీద ఉన్నవి మాత్రమే ఆయన ఆధీనంలో ఉన్నవి కావని, అక్రమంగా సంపాదించిన ఆస్తులనే కంపెనీలలో పెట్టుబడిగా చూపించిన వాటాలన్నదే అసలు కేసు, దాని మీద జరిగిందే విచారణ, దాని పర్యవసానమే అవి జగన్ చేసిన నేరాలన్నది ఆయన మీద ఆరోపణ.

జగన్మోహన్ రెడ్డి పేరు మీద రెండు కార్లున్నాయని, వాటిలో ఒకటి ఎక్కువ స్వీడ్ గా పోతుండగా ట్రాఫిక్ చలాన్ కూడా ఆయన నివాసానికి పంపించటం జరిగిందని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.  2008 లో ఆయన పేరు మీద రిజిస్టరైన కారు బిఎమ్ డబ్ల్యు ఎక్స్ 5, రంగు నలుపు, నంబర్ ఏపి 09 బిఎన్ 2345, మరో కారు 2009 లో ఆగస్ట్ 28 న రిజిస్టరైంది. ఇది స్కోర్పియో నల్ల రంగు కారు, నంబర్ ఏపి 09 బివి 1229.  అర్ టి ఏ ఆఫీస్ లో ఈ కార్లు ఇంకా ఆయన పేరు మీదే ఉన్నాయి.  అంత పెద్ద పెద్ద కుంభకోణాలుండగా వాటి ముంది చాలా చిన్నవైన వీటిని దాచవలసిన పనేముందన్నది తెలుగుదేశం పార్టీ వాదన.  తన పేరు మీద కార్లు ఏమీ లేవని జగన్ 2009 ఎన్నికల సమయంలో కూడా అఫిడవిట్ లో పేర్కొన్నారు.  

సరే అవన్నీ అలా ఉంచితే, హైద్రాబాద్ లోని లోటస్ పాండ్, బెంగళూరులో 31 ఎకరాల్లో నిర్మించిన ప్యాలెస్ మార్కెట్ విలువ ఎంత ఉంటుంది?  హైద్రాబాద్ లో బంజారా హిల్స్ లో గజం రూ.60000 పలుకుతోంది.  ఒక లగ్జూరియస్ ఫ్లాట్ ఉందంటే 1 కోటి రూపాయల పై చిలుకే.  అలాంటిది లోటస్ పాండ్ లోని భవనం ఎంత విలువ చెయ్యవచ్చు?  దాని మార్కెట్ విలువను పేర్కొన్నారా లేక రికార్డ్ లో ఉన్న విలువా? 

బెంగళూరు, హైద్రాబాద్, కడప, ఇడుపుల పాయ, పులివెందులలో భవంతులు కాక వివిధ పవర్ ప్రాజెక్ట్ లు, సాక్షి మీడియా, సిమెంట్ పరిశ్రమలలో జగన్ వాటాలన్నీ కలిపితే కేవలం రూ.416 కోట్లేనా.  మరి ఆ భవనాలను, లోటస్ పాండ్ వీడియోను, ఆయనకు సంక్రమించిన ఆస్తుల వివరాల పట్టీలను చూస్తే అవన్నీ కలిపితే ఆయన ఆస్తుల విలువ 416 కోట్ల రూపాయలే అయితే దానికి ఇంత రభస ఎందుకు?

జగన్ కి ఆస్తులు ఎలా వచ్చాయన్న ఈ ఫ్లో చార్ట్ చూడండి!

 

అంతేనా లేకపోతే అఫిడవిట్ ని హడావిడిగా పూరించటంలో అంకెలలో కొన్ని సున్నాలు ఎగిరిపోయి 416.00 అయిందా?  ఏది నిజం?  లక్ష కోట్లా లేకపోతే 416 కోట్లా?  రెండూ అయితే నిజం కాలేవు! 

(ఫొటోలు ఛార్ట్ లు సేకరణ- తెలుగుదేశంపార్టీ.ఆర్గ్ నుంచి)

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles