Pawan kalyan dress code for party

pawan kalyan dress code for party. Pawan Kalyan party Janasena, Pawan Kalyan party dress and color, Janasena party dress code

pawan kalyan dress code for party. Pawan Kalyan party Janasena

పవన్ కళ్యాణ్ డ్రస్ కోడ్

Posted: 03/14/2014 03:53 PM IST
Pawan kalyan dress code for party

పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టబోతున్న సందర్భంగా మీడియాలో పాత ఫొటోలలో ఎవరికి తోచిన ఫొటోలను వారు వేసారు కానీ, నిజంగా పవన్ కళ్యాణ్ ఏ విధమైన దుస్తులలో కనిపించబోతున్నారన్నది గోప్యంగా ఉంచారు. 

గబ్బర్ సింగ్ సినిమాలో పెళ్ళి చూపులకు వెళ్ళిన పంచె చొక్కాలో ఖండువాతో ఉన్న ఫొటోను కొందరు వాడితే, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పార్టీ యువనాయకుడిగా ప్రసంగమిచ్చిన పవన్ కళ్యాణ్ ఫోటోలను కొందరు ఉపయోగిస్తూ వచ్చారు. 

మరి కొందరు తీన్ మార్ సినిమాలో అర్జున్ పాల్వయ్ గెటప్ లో ప్యాంట్ మీద కుర్తాతో చూపిస్తున్నారు. 

ఇంతకీ పవన్ కళ్యాణ్ అని సినిమా ప్రపంచం పిలిచే కొణిదెల కళ్యాణ్ బాబు ఏ దుస్తుల్లో రాజకీయ నాయకుడిలా ప్రత్యక్షమౌతారన్నది ఉత్కంఠగా మారింది. 

లీడర్ సినిమాలో రానా లాగా పవన్ కళ్యాణ్ తను ఎప్పుడూ వేసుకునే కాజువల్స్ లోనా, టి షర్ట్ జీన్స్ లోనా లేకపోతే భారతీయత ఉట్టిపడే పంచెకట్టులోనా లేదంటే ఉత్తర భారతదేశ నాయకుల్లా కుర్తా పైజామా లోనా అదీ కాకపోతే వీటి మిశ్రమ దుస్తులా, తెల్లటి తెలుపా, కాషాయమా, ఎరుపు రంగా ఏమిటన్నది గుప్తంగా ఉంచారింతవరకు. 

సినిమా పరదా మీద కనపడగానే ఈలవేసి పువ్వులు చల్లుతూ కేరింతలు కొట్టే విధంగా పవన్ ఏదో ఒక కొత్త రూపంలో వస్తారన్న మాటలు వినపడుతున్నాయి.  అయితే ఇంకా ఉన్నది రెండు గంటలే కదా వేచిచూద్దాం తినబోతూ రుచులడగటం ఎందుకు అని అనుకునేవారూ ఉన్నారు. 

ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కాషాయ వస్త్ర ధారణ చేసారు కానీ జనసేన పార్టీ విషయంలో అయితే అత్తారింటికి దారేది చిత్రంలో స్వామివారి డ్రస్ ని మాత్రం ఎవరూ ఊహించుకోవటంలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles