Murali mohan comment on pawan party

Murali Mohan, pawan kalyan, murali mohan comment on pawan party, Maganti Murali Mohan, 2014 election, Murali Mohan TDP, TDP, Chandrababu naidu, ali, rajamandry.

murali mohan comment on pawan party

పవన్ పార్టీ పెడితే మాకే నష్టం? మురళీ మోహన్

Posted: 03/10/2014 12:29 PM IST
Murali mohan comment on pawan party

పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే..  చంద్రబాబుకే నష్టం అని  ఆపార్ట సీనియర్ నేత, సినీ నిర్మాత, నటుడు మురళీ మోహన్  మీడియా ముందు చెప్పటం జరిగింది.  గతం రెండు వారాల నుండి రాష్ట్రంలో పవనిజం గాలలు బలంగా వీస్తున్నాయి.  ఈ పవనీజం గాలలు వల్ల అధికంగా నష్టపోయేది కూడా  మాపార్టీయే అని  మురళీ మోహన్ చెప్పటం జరిగింది. ఇప్పటికే  మురళీ మోహన్  రాజమండ్రి నుంచి పోటీ చేయటానికి  సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ సందర్భంలో  మురళీ మోహన్  తెలుగుదేశం పార్టీ గురించి ఇలా మీడియా  ముందు ప్రకటన చేయటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మరళీ  మోహన్ పై మండిపడుతున్నారు.  కొంతమంది నాయకులైతే ఆందోళన చెందుతున్నారు.  మరుళీ మోహన్ అలా చెప్పటం  వెనుక రహస్యం దాగి ఉందని  పార్టీ లోని కొంతమంది సీనియర్ నాయకులు అంటున్నారు. 

ఇటీవల సినీ నటుడు ఆలీ  తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా.. తెలుగుదేశం పార్టీ రాజమాండ్రి టిక్కెట్  ఇస్తే ,  తప్పకుండా టిడిపిలోకి వస్తానని ఆలీ తన మనసులోని మాటను బయట పెట్టారు.  తెలుగుదేశం  పార్టీలో  ఇప్పటికే   చాలా మంది నాయకులు  రాజమండ్రి టిక్కెట్ పై  కచ్చిఫ్ వేయటం జరిగింది. అలాంటి వారిలో మురళీ మోహన్ ఒకరు.  

అయితే  ఆలీ రాజమండ్రి టిక్కెట్  విషయం పై  సీనియర్ నాయకులతో   చర్చించినట్లు సమాచారం.  సీనియర్ నాయకులు  ఆలీకి రాజమండ్రి టిక్కెట్  ఇవ్వటానికి  గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో, మురళీ మోహన్  ఆశ నిరాశగా మారింది.

దీంతో  ఆ నిరాశతోనే పవన్ కళ్యాన్   పార్టీ  గురించి ఇలాంటి ప్రకటన చేయటం జరిగిందని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. పవన్ పార్టీ పెడితే  అందులో చేరటానికే మురళీ మోహన్  తెర వెనుక పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఏమైన  పవన్ కళ్యాన్  పొలిటికల్ ఎంట్రీ  పెద్ద చరిత్ర   స్రుష్టిస్తుందని .. ఫిలింనగర్ వాసులు అంటున్నారు. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles