ఇప్పుడు సీమాంద్రలో ఈ విషయం పై ప్రజలు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. నిన్నటి వరకు మా పిల్లలు సమైక్య ఉద్యమంలో పాలుపంచుకొని, సగం జీవితం త్యాగం చేశారు. కానీ ఫలితం మాత్రం దగ్గలేదు. సీమాంద్ర నుండి తలపండిన రాజకీయ మేథావులు ఉన్నప్పటికి .. ఆంద్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచలేకపోయారు.
తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చిన నాటి నుండి సమైక్య రాగం పాడుతూ, కాంగ్రెస్ హైకమాండ్ పై పోరాటం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంద్ర పిల్లలపై ద్రుష్టి పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి సమైక్యంద్ర కోసం కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో.. తన కిరణాలు .. సీమాంద్ర పిల్లలు పైకి వదిలాడు. రీసెంట్ గా హైదరాబాదులో సీమాంద్ర విద్యార్థులతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, తన అభిప్రాయాలను విద్యార్థులకు చెప్పటం జరిగింది.
నేను రాజకీయ పార్టీ పెడితే .. మీరు మద్దతు ఇస్తారా అని సీమాంద్ర విద్యార్థులను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అడగటం జరిగింది. విద్యార్థుల నాయకులతో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమాశం అవ్వటంతో.. సీమాంద్ర ప్రజలు ఆందోలన చెందుతున్నారు.
తమ బిడ్డల భవిష్యత్తుతో రాజకీయం చేయవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు నల్లారిని వేడుకుంటున్నారు. రేపో,మాపో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన కొత్త పార్టీ ని ప్రజలకు పరిశయం చేస్తారని ఆయన వర్గీయులు అంటున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి సెష్పెండ్ అయిన కాంగ్రెస్ నాయకులు కూడా కిరణ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. కిరణ్ పార్టీ పెడితే.. చంద్రబాబు, జగన్ లపై అసంత్రుప్తి ఉన్న నేతలు కొత్త పార్టీలో చేరతారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
అంతేకాకుండా.. సీమాంద్రలో 15 శాతం నుండి 16 శాతం వరకు కొత్త పార్టీ కోసం ఎదురుచూస్తున్నారని కిరణ్ గ్యాంగ్ సర్వే చేసి చెబుతుంది. ఇప్పటికే కిరణ్ గ్యాంగ్ కొన్ని పేర్లను రిజిష్టర్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలలోకి రావటంతో.. కిరణ్ కమార్ రెడ్డి గ్యాంగ్ రిజిష్టర్ చేసిన పేరుతోనే 2014 ఎన్నికల్లో పోటీ చేస్తారని నల్లారి వర్గీయులు చెబుతున్నారు.
నల్లారి వారి కొత్త పార్టీ వస్తుందని తెలిసినప్పటి నుండి సీమాంద్ర లోని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే.. తెలంగాణ సాధన ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు బలిదానం అయ్యారు.
అలాగే కిరణ్ పార్టీ పెట్టి, విద్యార్థులను టార్గట్ చేస్తే, గత పరిస్థితి కంటే.. ఇప్పుడు దారుణంగా ఉంటుందని సీమాంద్రలోని తల్లిదండ్రులు అంటున్నారు. నల్లారి పార్టీతో పేరు తో పిల్లలను, పిల్లల చదువులను, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని సీమాంద్ర ప్రజలు అంటున్నారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టినా, పెట్టకపోయిన, సీమాంద్ర ప్రజలకు ఎలాంటి లాభం ఉండదని రాజకీయ మేథావులు అంటున్నారు. నల్లారి తన బలం హైకమాండ్ ముందు నిరుపించుకోవటానికే ఈ కొత్త పార్టీ అని సీమాంద్రలోని విద్యార్ధులు అంటున్నారు. మా పిల్లల జీవితాలతో ఆటలాడుకోవద్దాని నల్లారిని సీమాంద్ర ప్రజలు వేడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more