Power star in power game

power star in power game, Pawan Kalyan into politics, Praja Rajyam party, Chiranjeevi, Jai Hind party of Pawan Kalyan, Pawan Kalyan Republican party

power star in power game, Pawan Kalyan into politics

పవర్ గేమ్ లో పవర్ స్టార్?

Posted: 03/05/2014 01:02 PM IST
Power star in power game

పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనం సృష్టించటం సహజం.  అవి గబ్బర్ సింగ్ 2 గురించిన వార్తలే కానీ లేదా ఆయన మూడవ కళ్యాణం గురించిన విశేషాలే కానీ వివరాలు పూర్తిగా లేకపోయినా చకచకా వార్తలలోకి చోటుచేసుకుంటాయి, పాఠకులు వాటిని ఆత్రుతగా చదివేస్తారు.  అందుకు కారణం పవన్ కళ్యాణ్ మీద అభిమానమే కాకుండా అతను ఏం చేసినా నలుగురి మంచికే చేస్తాడనే నమ్మకం కూడా కావొచ్చు. 

పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావటానికి ఉత్సుకతను చూపిస్తున్నట్లుగా సంకేతాలు చాలా వచ్చాయి.  అయితే ప్రస్తుతమున్న పార్టీలో చేరుతాడా లేకపోతే సొంత పార్టీని పెడతాడా అన్నది ఎవరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు.  మార్చి 9 న ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రకటన చెయ్యబోతున్నారని కూడా తెలుస్తోంది.  పేరు, పార్టీ సిద్ధాంతం, పార్టీ లక్ష్యాలు, జెండా, విధివిధానాలను నిర్ణయించటానికి పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించిన నిపుణుల బృందంతో కసరత్తు చేస్తున్నారన్న సమాచారం సర్వత్రా గుప్పుమంటోంది.

లోగడ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాలలో చురుగ్గా పాల్గొనటం కోసం యువసేనకు నాయకత్వం వహించే ఎంతో చెయ్యాలన్న ఆయన కోరిక ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు నీరుగారి పోయిందని, అయితే పూర్తిగా అణగారిపోని ఆ కోరిక వలన రాజకీయాల్లోకి రావాలనే ఆ ఉత్సాహం మరోసారి పైకి ఉబికిందని, అందుకే ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నారని కొందరి అభిప్రాయం.

రిపబ్లికన్ పార్టీ అని పేరు పెట్టవచ్చని కొందరి అభిప్రాయం.  ఎందుకంటే దానికి ముందు పవన్ అనే పేరు చేరుస్తే అది పిఆర్ పి అవుతుంది.  లేదా పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ అని పేరు పెట్టవచ్చు.  లేదంటే ఆయనకి బాగా ఇష్టమైన జైహింద్ ని ఉపయోగించి పార్టీ నామకరణం చెయ్యవచ్చు. 

ఈ పార్టీలకు వెనక సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ, రామోజీరావులు పవన్ కళ్యాణ్ వెనక ఉన్నారన్న వార్తలు కూడా ప్రస్పుటంగా వినిపిస్తున్నాయి.  అయితే దీనితో మరో అనుమానం కూడా కలుగుతోందని అంటున్నారు- ఒకవేళ ఇదంతా తెలుగు దేశం పార్టికి మద్దతునివ్వటానికే చేస్తున్నారా అని. 

ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రాలో అడుగుపెట్టటానికి పవన్ కళ్యాణ్ వేదికను తయారుచేస్తున్నారేమో అన్న అనుమానాన్ని కొందుర వ్యక్తపరుస్తున్నారు.

అయితే అన్నిటికన్నా మిన్నగా ఆయనను అభిమానించే వారిలో కొందరు మాత్రం అనవసరంగా లేనిపోని దారినిపోయే కంపను తగిలించుకుంటున్నాడేమో అనే భయాన్ని వెలిబుచ్చారు.  రాజకీయాలలోకి రానంతవరకు అంతా బాగానే వుంటారు.  రాజకీయ రంగ ప్రవేశం చెయ్యటంతోనే వాళ్ళకి శత్రువులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతారు.  ప్రతి కదలికనూ భూతద్దంలో చూస్తారు, అన్నిటికీ పేర్లు పెడతారు, వ్యంగ్యవ్యాఖ్యలు చేస్తారు, వ్యక్తిగత విషయాలను బయటకు లాగుతారు.  ఇంతవరకూ లేనిది పవన్ కళ్యాణ్ మరొకటి చూస్తాడు.  అదేమిటంటే క్యారికేచర్.  పత్రికలలో పవన్ కళ్యాణ్ కార్టూన్ లు వస్తాయి, టివిల్లో ఆయనను అనుకరిస్తూ టివిషోలు మొదలవుతాయి.  ఇదంతా అవసరమా అంటున్నారు రాజకీయరంగప్రవేశం వలన ఆయనకేం నష్టం వాటిల్లుతుందో అని భయపడతున్న అభిమానులు కొందరు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles