Trs leaders pressure to kcr

kcr, trs party, telangana state, congress party, trs leaders, trs party merge, trs leaders pressure to kcr, TRS leaders demands KCR, congress party, TRS chief K Chandrasekhar Rao.

trs leaders pressure to kcr, TRS leaders demands KCR

కేసిఆర్ కు చెమటలు పుట్టిస్తున్న టీఆర్ఎస్ నాయకులు?

Posted: 02/28/2014 12:57 PM IST
Trs leaders pressure to kcr

లీడర్ అంటే కేసిఆర్ అని  నాలుగు కోట్ల మంది ప్రజలతో.. దేశంలోని  రాజకీయ నాయకులు కూడా అనుకున్నారు.  అరవైఏళ్ల సమస్య పై పోరాటం చేసి గెలిచిన  తెలంగాణ వీరుడని  తెలుగు గొంతులు గోల చేశాయి. పుష్కరకాలంలోనే  అరవైఏళ్ల కలను  నిజం చేసిన  తెలంగాణ ముద్దు బిడ్డ తెలంగాణ ప్రజలు మొచ్చుకున్నారు.  కేసిఆర్  సత్తా ఏమిటో ..లోకానికి తెలిసిందని.. ఆ పార్టీ నాయకులు ఆనందంతో తీన్ మార్ ఆడి, కేసిఆర్ రుణం తీర్చుకున్నారు.  

కేసిఆర్ బలం ఏమిటని చాలా మంది చాలా చోట్లు  వెతికి వెతికి విసిగిపోయారు.  కానీ కేసిఆర్ బలం ఒక్కటే.  ఆయన మాటే  కేసిఆర్ ఆయుధం.  కేసిఆర్ ఒక్క మాటతో  వివాదం స్రుష్టించగలడు,  ఒకే మాటతో కోట్ల మందికి నాయకుడు  కాగల సత్తా కేసిఆర్ పుష్కలంగా ఉందనే విషయం తెలంగాణ విజయంతో  రుజువు అయ్యింది.  ఇప్పటి వరకు కేసిఆర్ రాజకీయ ప్రయాణం సాఫిగానే సాగింది. కానీ ఇక ఇక్కడ నుండి  కేసిఆర్  రాజకీయ జీవితం ఎలా సాగుతుందోనని .. చాలా మంది ఆందోళన చెందుతున్నారు. 

ఇప్పుడు కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఆనందం కంటే..  తెలంగాణ రాష్ట్ర  సాధన కై పుట్టిన పార్టీ మనుగడలేకుండా పోతుందనే భయం ఆయనలో కనిపిస్తుందని  రాజకీయ మేథావులు అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ తో కేసిఆర్ చీకటి ఒప్పందం ఏమిటో  ఎవరికి తెలియదు.

కానీ  కాంగ్రెస్ పెద్దలు,  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసిఆర్ కు  అల్టీమెట్స్  జారీ చేస్తున్నారు. కేసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మీడియా ముందు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలైతే.. త్వరలో కేసిఆర్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడని ప్రకటనలు చేస్తున్నారు. 

kcr vs trs leaders

ఇలాంటి ప్రకటనలతో టీఆర్ఎస్ నాయకులు. చిర్రెత్తిపోతున్నారు.  టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం  చేసేది లేదని, ఒకవేళ ఉంటే రెండు సంవత్సరాల తరువాత ఆలోచిస్తామని.. టీఆర్ఎస్  నాయకులు అంటున్నారు.  ఒక పక్క  కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి, మరో పక్క సొంత పార్టీ నాయకుల వార్నింగ్స్ తో , రాబోయే ఎన్నికల కసరత్తుతో , ఫామ్ హౌస్ లో ఉన్నకేసిఆర్ చెమట్లు పడుతున్నాయని  ఆ పార్టీ నాయకులు అంటున్నారు.  

కాంగ్రెస్ తో పార్టీని  విలీనం చెయ్యకపోతే.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కేసిఆర్ బాగా తెలుసు. ఈ మూడు సమస్యలతో కేసిఆర్ నలిగిపోతున్నారు.  అంతేకాకుండా.. టీఆర్ఎస్ పార్టీ నుండి  కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే  అరవింద్ రెడ్డి, విజయశాంతి లాంటి నాయకులు  కాంగ్రెస్  కండువా వేసుకున్నారు.  

తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు మాత్రం   టీఆర్ఎస్ పార్టీని .. కాంగ్రెస్ పార్టీలో విలీనం  వద్దని కేసిఆర్ ను వేడుకుంటున్నారు.  ఈ విలీనం ముచ్చట నుండి కేసిఆర్ ఎప్పుడు బయటపడతాడో చూద్దాం.  తెలంగాణ ప్రజల మాటకు కేసిఆర్ విలువిస్తాడో, లేక కాంగ్రెస్ హైకమాండ్  లోంగిపోతాడో చూడాలని ఆయన అభిమానులు  ఎదురుచూస్తున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles