Rahul gandhi fight on women s rights

rahul gandhi, Congress vice-president Rahul Gandhi, congress party, rahul gandhi kiss, bjp, narendra modi, priyanka, sonia gandhi, women rights.

rahul gandhi fight on women-s rights

అమ్మాయిల జపం చేస్తున్న యువనేత రాహుల్ గాంధీ?

Posted: 02/27/2014 10:47 AM IST
Rahul gandhi fight on women s rights

కాంగ్రెస్ పార్టీ  ఉపాధ్యక్షుడు  యువ,నేత రాహుల్  గాంధీ కొత్త జపం చేస్తున్నారు.  అదే అమ్మాయిల జపం. ఇప్పుడు  యువనేత  రాహుల్  గాంధీ  అమ్మాయిల జపం చేస్తున్నారు. అంటే  రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదు కాబట్టి  మరోలా అనుకోకండి?  నేటి  సమాజంలో  అమ్మాయిల (మహిళల) పట్ల రోజు రోజు వివక్షత  పెరిగిపోతోందని యువనేత రాహుల్ గాంధీ చాలా బాధపడుతున్నాడని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  

రాహుల్ గాంధీ  ఇప్పుడు  అమ్మాయిల జపం ఎందుకు చేస్తున్నాడయ్యా  అంటే.. రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని,  ప్రధాని మంత్రి పదవి కి పోటీ పడుతున్న  నరేంద్ర మోడీని టార్గట్ చేసుకోని  అమ్మాయిల జపం చేస్తున్నారని  రాజకీయ మేథావులు అంటున్నారు. 

రాహుల్‌గాంధీ ఈ మధ్య కాలంలో ఎక్కడుకు వెళ్లినా అమ్మాయిల సమస్యలు గురించి మాట్లాడతున్నారు. అసోం పర్యటనలో భాగంగా గౌహతి ఎన్‌ఐటీ విద్యార్ధులతో ఆయన భేటీ అయ్యారు. దేశంలోని వివిధ ఎన్‌ఐటీ విద్యార్ధులతో నేరుగా మాట్లాడారు.

ఈశాన్య రాష్ట్రాల విద్యార్ధులు ఎదుర్కొంటున్న విద్య, ఉపాధి సమస్యల నుంచి అమ్మాయిల సమస్యల వరకు అన్ని విషయాలను ప్రస్తావించారు. జనాభాలో సగభాగం ఉన్న అమ్మాయిలను చిన్నచూపు చూడటం తగదంటున్నారు.

చట్టసభల్లో పురుషులతో సమానంగా మహిళల ప్రాతినిధ్యం పెరిగినప్పుడే సమాజంలో వారి పట్ల వివక్ష తగ్గుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో ఆమోదం కోసం యూపీఏ కృషి చేసినా, ప్రతిపక్షాలు సహకరించలేదని ఆయన విమర్శించారు. 

రాహుల్ గాంధీ  మాట్లాడుతూ..అమ్మాయిల పట్ల వివక్షతను విడనాడినప్పుడే సమాజాభివృద్ధి సాద్యమన్నారు. విద్య, ఉపాధి అంశాల్లో మహిళలను చిన్న చూపు చూడటం తగదన్నారు. విద్యా సంస్థల నుంచి పని ప్రదేశాల వరకు అమ్మాయిలు అడుగడుగుగా వివక్షకు గురువుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

అమ్మాయిలపై అత్యాచారాలు, అకృత్యాలు పెరిగిపోతున్నయాని అన్నారు. అమ్మాయిలపై జరుగుతున్న లైగింకదాడులతో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకొవాల్సి వస్తోందని రాహుల్‌ ఆవేదన  వ్యక్తం చేయటం  జరిగింది.  

రాహుల్ గాంధీ అమ్మాయిల జపం ఏం సాధిస్తారో  చూద్దాం.  ఈ అమ్మాయిల జపం వెనుక .. ప్రియాంక  హస్తం ఉందని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. రీసంట్ గా కాంగ్రెస్ మీడియా ప్రచారం చేస్తున్న ప్రకటనలు కూడా  అమ్మాయిల సంబంధించిన  అంశాలనే  తీసుకున్నట్లు  కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles