Political parties hopes to rajinikanth support in election

actor Rajinikanth, tamil super star rajinikanth, Dravidian parties, BJP, election time in Tamil Nadu, Narendra Modi, Cm jayalalitha, rajinikanth fans.

political parties hopes to Rajinikanth support in election

రజనీకాంత్ మాట కోసం జాతీయ పార్టీలు ఎదురుచూపులు?

Posted: 02/26/2014 03:38 PM IST
Political parties hopes to rajinikanth support in election

తమిళ  సూపర్ స్టార్  రజనీకాంత్  మాట కోసం జాతీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.  సూపర్ స్టార్   రజనీకాంత్ కు ప్రపంచమంత  అభిమానులు ఉన్నారు.  ఆయన  మాట కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.  రాబోయే ఎన్నికల్లో  రజనీకాంత్  అభిమానులు ఎవరికి మద్దతు ఇవ్వాలి?   ఏ పార్టీకి  ఓటు వేయాలి అనే దానిపై అభిమాను ఒక సర్వే నిర్వహించారు. 

రజనీకాంత్  పిలుపు తో  రాజకీయ పార్టీల రూపు రేఖలే మారిపాతాయేని విషయం  జాతీయ పార్టీలకు, ద్రవిడ పార్టీల బాగా తెలుసు.  తమిళనాడు రాష్ట్రంలో  రజనీకాంత్  కనుసైగలతో   రాజకీయలను శాసించగల  శక్తి ఆయనకు  ఉన్న , ఎప్పడు దాన్ని రజనీకాంత్ ఉపయోగించలేదు. అలాగనీ తన అభిమానులను  దూరం చేసుకోలేదు. రాజకీయ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ  రాజకీయ నాయకుల  కన్ను  సూపర్ స్టార్ రజనీపై కేంద్రీకృతమై ఉంది.  

 ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దీనికితోడు, రజనీ అభిమానులు చేస్తున్న హడావిడి చర్చనీయాంశమైంది. చెన్నై, సేలంలో వారు అభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు. ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారన్న సమాచారం సేకరిస్తున్నారు.

రజనీకాంత్ 1996లో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి రజనీ మద్దతు పలికారు.  గత ఎన్నికల్లో మంచి పాలన అందించే పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చార. ఈసారి  రజనీ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనికి తోడు, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో రజనీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు రజనీ నోటి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

ఆయన అభిమానులు చేపట్టిన అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత, రజనీ ఓ నిర్ణయానికి వస్తారని తమిళ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అంతేకాకుండా తమిళనాడు  ముఖ్యమంత్రి  జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో కూడా రజనీకాంత్  మంచి సంబందాలు ఉన్నాయి.  

రాజకీయ ఎన్నికలు  ముంచుకొస్తున్న వేళ .. రజనీకాంత్  ఒక అగ్నిపరీక్షగా మారిందని  ఆయన సన్నిహితులు అంటున్నారు.  ఏ పార్టీ, ఏ నాయకుడికి రజనీకాంత్  మద్దతు తెలిపితే.. మిగిలన రాజకీయ పార్టీలు , మిగిలిన రాజకీయ నాయకులు రజనీకాంత్  దూరమవుతారనే  విషయంకూడా రజనీకి బాగా తెలుసు. 

అందుకే  ఇప్పటి వరకు  రజనీకాంత్  నోటి  ఎలాంటి ప్రకటన రాలేదు, కానీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత  రజనీ పై ఒత్తిడి  పెంచుతున్నట్లు .. రాజకీయ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.  రజనీకాంత్ ఆఖరి నిమిషంలో  ఏ పార్టీ , ఏ రాజకీయ నాయకుడికి  మద్దతు ఇస్తారో  చూద్దాం.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles