T effect on tamil nadu revenues

T effect on Tamil Nadu revenues, Telangana Bill, Tax holiday in Seemandhra, Tamil Nadu revenues T Bill, Tamil Nadu Chief Minister, Jaya Lalitha on T Bill

T effect on Tamil Nadu revenues, Telangana bill

విభజన బిల్లుతో తమిళనాడు మీద ప్రభావం- జయలలిత ఆవేదన

Posted: 02/17/2014 10:29 AM IST
T effect on tamil nadu revenues

రాష్ట్ర విభజన బిల్లు మీద రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతుంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ బిల్లు మీద తీవ్ర ఆశంకలు ఆవేదనలను వ్యక్తం చేసారు.

ఒక పక్క రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అంటూనే నాయకులు షరతులు కూడా విధించటం, అందుకు కేంద్రం మొగ్గు కూడా చూపించటంపై జయలలిత ఆందోళన చెందటానికి కారణం సహేతుకమే.  ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణాను తెగనరికిని తర్వాత మిగిలిన శేష ఆంధ్ర ప్రదేశ్ కి కొత్త రాజధాని నిర్ణయంతో పాటుగా ఆదాయంలో నష్టాన్ని పూరించటం కోసం పన్ను రాయితీని కూడా కేంద్రం ప్రకటించనుందని వార్త రావటంతో జయలలిత అందుకు అభ్యంతరాలను తెలియజేస్తున్నారు. 

సీమాంధ్ర సీమలో ఉన్న తమిళనాడులోని పరిశ్రమలు పన్ను రాయితీని పొందటం కోసం సీమదాటి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది.  అందులోనూ కొత్త రాజధాని చెన్నైకి ఎక్కువ దూరంలో లేకపోతే వ్యాపారులు వలసపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఎందుకంటే కొత్త ప్రాంతంలో ముందు నుంచే వ్యాపారంలో వేళ్ళు పాతుకుంటే ఎక్కువ లాభదాయకమని అనుకునేవారు చాలా మంది ఉంటారు. 

ఆవిధంగా, తెలంగాణా ఏర్పడి శేషాంధ్రప్రదేశ్ లో పన్నురాయితీ గనక ఉంటే తమిళనాడులోని ఆదాయానికి గండిపడక తప్పదని జయలలిత ఆవేదన చెందుతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles