కేవలం 49 రోజుల్లో..ఢిల్లీలో మరో సంచలనానికి దారితీసింది. కేవలం ‘మార్పు’అనే దాని కోసం ఢిల్లీ ప్రజలు ఒక సామాన్య వ్యక్తి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపి పార్టీలతో విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్సు కోరుకున్నారు. అలాంటి సమయంలో.. వారికి దేశ అవినీతిపై పోరాటం చేస్తున్నా.. అన్న హాజరే శిష్యుడు .. అరవింద్ కేజ్రీవాల్ కనిపించారు.
‘విప్లవభావాలు కలిగిన .. అరవింద్ కేజ్రీవాల్ .. ఢిల్లీ ప్రజలకు అతి దగ్గరై.. ఆమ్ ఆద్మీ పార్టీ.. నేతగా.. ఢిల్లీ ప్రజల్లో వెళ్లి, చిపురు(జాడు కట్ట) గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేసి 29 మంది ఎమ్మెల్యేలను దక్కించుకోని.. జాతీయ పార్టీల పొగరు దించాడు.
అయితే ప్రతిపక్షపార్టీ గా ..బిజేపి రావటంతో.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖంగుతిన్నది. దీంతో.. అరవింద్ తో.. అర్థరాత్రి మంతనాలు జరిపి..ఢిల్లీ అధికారన్ని .. అరవింద్ కేజీవాల్ చేతిలో పెట్టింది. దీంతో అరవింద్ పై ప్రతిపక్ష నాయకులు అనే రాజకీయ విమర్శలు చేసిన, సామాన్య ప్రజలు మాత్రం ఆనదంగా ఉన్నారు.
ప్రజల కోసం ప్రజల మద్య నుంచి వచ్చిన నాయకుడని .. ఢిల్లీ ప్రజలు మురిచిపోయారు. ఓ సామాన్యుడు ముఖ్యమంత్రి గా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ మద్దతుతో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా అయ్యారు సొంత బలంతో కాదనే విమర్శ ప్రతిపక్ష నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో.. అరవింద్ పై ఉన్న క్రేజ్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
ఎప్పుడైన .. కాంగ్రెస్ పార్టీ, బీజేపిల నుండి .. తనకు ముంపు ఉంటుందని ముందే అరవింద్ కేజ్రీ వాల్ ఊహించారు. అదే ఈరోజు నిజమైంది. ఢిల్లీ రాజకీయకం చాలా హాట్ బాబు అనే విధంగా ఉంటాయి. సైలెంట్ గా ఉంటే.. షీలా దీక్షిత్ కాబట్టి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది.
అరవింద్ లాంటి వ్యక్తి .. 49 రోజులే చేయటమే చాలా గోప్ప విషయమని.. ప్రతి పక్ష నాయకులే అంటున్నారు. అసలు అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడో రాజీనామా చేయాల్సి.. కానీ సమయం కోసం ..ఎదురుచూస్తున్నట్లు .. ప్రతిపక్ష నాయకులే మీడియా ముందు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్ పాల్ బిల్లు ను అరవింద్ కేజ్రీవాల్ కలిసి వచ్చిందని అంటున్నారు.
ఇప్పుడు జన్ లోక్ పాల్ బిల్లే అరవింద్ కెజ్రీ వాల్ కు ఆయుధంగా మారిందని.. బిజేపి నాయకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ , బిజేపి లు కలిసి కొత్త డ్రామకు తెరలేపాయి. అరవింద్ కు పెరుగుతున్న క్రేజ్ ను దెబ్బ తీసేందుకు పద్మవ్యూహం రచించారు.
లోక్ పాల్ .. బిల్లు అసెంబ్లీలో పాసైతే.. అరవింద్ కేజ్రీ వాల్ కు దేశ వ్యాప్తంగా.. ఇమేజ్ పెరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ, ( ఏదిగే మొక్కన తల తుంచితేనే బొన్సాయ్ ట్రీగా మారిపోతుంది) అరవింద్ పై రాజకీయ కుట్ర చేసి, అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకులతో.. లోక్ పాల్ బిల్లు వ్యతిరేకంగా ఓటు వేయించినట్లు.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
అప్పటి వరకు లోక్ పాల్ బిల్లు కు మద్దతు తెలుపుతామని చెప్పిన ప్రతిపక్ష నాయకులే.. వ్యతిరేకంగా ఓటు వేయటం జరిగింది. ఢిల్లీలో ఉంటే కాంగ్రెస్ ఉండాలి? లేదా బీజేపి ఉండాలి అంతేగానీ.. మిగిలిన ఏ పార్టీలు అధికారంలోకి రాకూడదనే.. రూల్ పెట్టుకున్నాయి.
జాతీయ పార్టీలు. కేజ్రీవాల్‌కి స్టార్ డమ్ ఇవ్వకూడదని కాంగ్రెస్ మళ్ళీ ముందుకు నడిచింది ఆయనతో కలిసి ఈసారి, కాంగ్రెస్ ` బీజేపీ, కేజ్రీవాల్ కోరుకున్న లోక్‌పాల్ బిల్లుకి మద్దతివ్వలేదు.
ఆ కారణం చూపి, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి, ఆమ్ ఆద్మీకన్నా బీజేపీకే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లొచ్చాయి. ఆ లెక్కన ఢిల్లీ ప్రజలు బీజేపీని అధికారపీఠమెక్కించాలనుకున్నారు, కానీ బీజేపీ ఉత్సాహం ప్రదర్శించలేదు.
దీంతో కేజ్రీవాల్‌కి ఛాన్సొచ్చిందంతే. వచ్చిన ఛాన్స్‌ని రాజకీయంగా సద్వినియోగం చేసుకున్నారు ఆయన. ఇప్పుడేమో, తనకు రాజకీయం తెలియదంటున్నారు, నమ్మేదెవరు.? ఎప్పటికైన అరవింద్ కేజ్రీ వాల్ పదవి దిగిపోవాల్సిందే అని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కార్ గురించి సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమైనా, ‘మార్పు’ను ఆశించి, ఆ పార్టీకి మద్దతిచ్చిన సామాన్యులు, ఆ మాటల్లోని వాస్తవాన్ని గ్రహించలేకపోయారు.
ఇప్పుడు వారికి వాస్తవం అర్థమవుతోంది. ఏ పార్టీని అయితే తిట్టి, ఆ పార్టీకి అధికారం దూరం చేశారో, అదే పార్టీ మద్దతుతో కేజ్రీవాల్ అధికార పీఠమెక్కినప్పుడే.. కేజ్రీవాల్‌లోని రాజకీయ కోణం అందరికీ కన్పించింది. ఆయనెంత పక్కాగా పొలిటికల్ ప్లాన్ అమలు చేశారో ఇప్పుడాయన రాజీనామా చేసిన తీరుని బట్టి అర్థమవుతోంది.
అదిగదిగో సార్వత్రిక ఎన్నికలు.. అన్న తరుణంలో ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. కాంగ్రెస్, బీజేపీలను తిట్టిపోస్తున్నారు. ఆ రెండు పార్టీలూ అవినీతి పార్టీలని విమర్శిస్తున్నారు. ఆయన మాటల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కి ఎదురుగాలి వీస్తోంది. ఆ కారణంగానే భారతీయ జనతా పార్టీ వైపు జనం చూస్తున్నారు తప్ప, బీజేపీనీ పూర్తిగా నమ్మి, ఆ పార్టీ అధికారంలోకి రావాలని దేశమంతా కోరుకుంటున్న పరిస్థితి లేదు. సరిగ్గా ఇగే అరవింద్ కేజ్రీవాల్‌కి కావాల్సింది.
సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఎంపీ అభ్యర్థుల్ని నిలబెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని దేశమంతా గమనిస్తోందనీ, కాంగ్రెస్ ` బీజేపీల తీరు లోక్‌పాల్ విషయంలో ఎలా వుందన్నది అందరికీ అర్థమవుతోందనీ, అవినీతికి వ్యతిరేకంగా లోక్‌పాల్‌ని తెరపైకి తెస్తోంటే అడ్డంపడ్తున్నాయని తాను పంపుతున్న సంకేతం జనంలోకి వెళ్తుందని కేజ్రీవాల్ భావిస్తున్నారు.
ఇంత పక్కాగా పొలిటికల్ ప్లాన్‌ని అమలు చేయాలంటే, రాజకీయాల్లో తలపండిపోవాలి. పార్టీ పెట్టిన అనతికాలంలోనే, ముఖ్యమంత్రి అయిన అతి కొద్ది రోజుల్లోనే అరవింద్ కేజ్రీవాల్ రాజకీయంగా చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. రాజకీయ వ్యూహాల్లో తనకు సాటి ఇంకెవరూ లేరన్పించేసుకున్నారు.
అధికారం తృణప్రాయమంటూ చెప్పిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. 49 రోజుల పయనానికి ఫుల్ స్టాప్ పడింది. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కేజ్రీవాల్ పాత సంప్రదాయాలను పూర్తిగా వదిలేశారు. ముక్కు సూటిగా వెళ్లడం..మొండిపట్టు పట్టడం ఆయన నైజం.
సీఎం పదవిలో ఉన్నా సరే రోడ్డెక్కి పోరాటం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి నుండి ముఖ్యమంత్రి దాకా అదే స్టైల్ కనబరిచారు. ఎంత సెన్సేషనల్ అధికార పీఠాన్ని ఎక్కారో..అంతే సంచలనాత్మకంగానే దిగిపోయారు. అయితే కేజ్రీ వాల్ క్రేజీగా .. సీఎం పదవి వదులుకోవటం వెనుక అమ్మ హస్తం ఉందని.. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకోని కాంగ్రెస్ నాయకులే.. జన్ లోక్ పాల్ బిల్లు కు ఓటు వేయలేదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అంటున్నారు. అరవింద్ కేజ్రీ వాల్ తో.. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ కి పెరుగుతున్న ఇమేజ్ ను దుష్టిలో పెట్టుకోని అరవింద్ కేజ్రీవాల్ చేత రాజీనామా చేయించినట్లు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more