పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.. ఈరోజు తెలంగాణ బిల్లు పై లోక్ సభలో జరిగిన దానిపై ఆయన మాట్లాడటం జరిగింది. తెలంగాణ కు మద్దతు ఇస్తామన్న బిజేపి పార్టీ నాయకులు.. లోక్ సభలో మాత్రం తెలంగాణ బిల్లు పై యూ టర్న్ తీసుకోవటం పై బొత్స హర్షం వ్యక్తం.
రాష్ట్రం సమైక్యం ఉంటే చాలా సంతోషమని సత్తిబాబు చెప్పటం జరిగింది. విభజన అంశం ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు చిన్న విషయమని , ఇలాంటి వాటిపై చర్చ అవసరం లేదని సత్తిబాబు చెప్పటం జరిగింది. పార్లమెంట్ లో జరిగిన ఘటన పై సత్తిబాబు బాధపడుతున్నట్లు సమాచారం.
సత్తిబాబు సమైక్యాంద్రనే కోరుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమండ్ ముందు వినిపించే సమైక్యం సత్తిబాబులో లేదని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ఈరోజు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును , కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టడం జరిగింది.
దీంతో సీమాంద్ర నాయకులు పార్లమెంట్ లోని ఎంపీలను పరుగులు పెట్టించింది లగడపాటి పెప్పుర్. ఇక్కడే తెలంగాణ నేతలు.. సీమాంద్ర నేతల మద్య ముష్టి యుద్దం జరిగింది.
పార్లమెంట్ లో కాంగ్రెస్ నాయకులే.. పట్టపగలు.. పెప్పర్ తో సమైక్యంద్ర కోసం ఫైట్ చేస్తుంటే.. ఇటలీ గాంధీ మాత్రం మన్మోహన్ సింగ్ (మౌనం) బాటలో నడిచివెళ్లిపోయారు.
సీమాంద్ర నాయకుల సమస్యలను కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు పట్టించుకోవటం లేదోనని బీజేపి నాయకులు అడుగుతున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం సైలెంట్ గా తెలంగాణ బిల్లును లోక్ సభలో పెట్టి, చేతులు దులుపుకుంది.
పట్టపగలే కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ లో ఇలా రెచ్చిపోవటం చూస్తే.. కాంగ్రెస్ పార్టీయే కావాలని ఈ డ్రామా ఆడించినట్లుగా ఉందని ..బీజేపి నాయకులు అంటున్నారు. సీమాంద్ర నేతల పై తెలంగాణ నేతలు చేతులు లేపితే తప్పులేదు.గానీ.. ఆత్మరక్షణ కోసం పెప్పర్ వాడితే.. తప్పా? అని సీమాంద్ర నేతలు అడుగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ మీద సీమాంద్ర నేతలు ఫైట్ చేస్తుంటే.. తెలంగాణ నేతలకు అంత బలుపు ఎందుకని సమైక్యవాదులు అడుగుతున్నారు. మీరు విడిపోవాలని అంటున్నారు, మేము వద్దు అంటున్నాం, ఇద్దరి మద్య మూడో వ్యక్తి గా కాంగ్రెస్ హైకమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక్యంగా..కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ కు అనుకూలంగానే ఉన్న విషయం ప్రతి ఒక్కరి తెలుసు.
సీమాంద్ర నేతలు, సమైక్యవాదులు .. చివరి బంతి వరకు ఆడిన.. పైనల్ గా గెలుపు తెలంగాణ నేతలదే కదా ? ఈ చిన్న సుక్ష విషయాన్ని మరిచిపోయి.. అంభోతుల్లా.. సీమాంద్ర నేతల పై దాడి చేస్తుంటే.. ఊరుకుంటారా? ఆత్మరక్షణ కోసమే పెప్పర్ వాడినట్లు లగడపాటే చెబుతున్నారు.
ఇక్కడే ‘‘గుర్రాన్ని తొట్టిదాక తీసువెళ్లగలం గానీ తొట్టిలోని నీటిని తాగించగలమా? ’’ అలాగే సీమాంద్ర నేతలు, సమైక్యవాదులు.. ఎన్ని కట్టాలు పెట్టుకున్న ఇటలీ గాంధీలో ఇంటిలో ఊడకవనే తెలంగాణ నేతలకు బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో.. మూర్ఖంగా ప్రవరిస్తే.. ఇలాగే జరుగుతుంది.
సీమాంద్ర నేతలు గోల చేసిన, మైకులు విరిసిన, పెపర్లు చించి గాలీలోకి విసిరేసిన వారి చర్యలు స్పీకర్ తీసుకుంటుంది, లేదా ఆయా పార్టీలు చర్యలు తీసుకుంటాయి. అంతేగానీ సాటి ప్రజా నాయకుడిపై చట్టసభలో చెయి చేసుకుంటే ఏమంటారు?
అప్పుడు ప్రజాస్వామ్యం మంటకలిసిపోయినట్టు కాదా? కేవలం పెప్పుర్ చల్లితే ప్రజాస్వామ్యం మంటకలిసిపోతుందా? ‘‘ప్రతి ప్రశ్నకు .. ఒక సమాధానం ఉంటుందనే నీతి సూత్రాన్ని ..ఇరుప్రాంతాల నాయకులు రాజకీయ పార్టీలు ఎలా మరిచిపోయాయి’’ తెలుగు ప్రజలు అడుగుతున్నారు.
ఏరోజైన , ఎప్పుడైన ఇరు ప్రాంతాల నేతలతో కలిసి తెలంగాణ సమస్యపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? గడిచిన పదేళ్లలో ఎప్పుడైన , ఎక్కడైన జరిగింది. తెలుగు ప్రజల మద్య నిప్పు పెట్టింది కాంగ్రెసే, మళ్లీ నీళ్లు చల్లేది కాంగ్రెస్? అసలు కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ్ నుండి ఏం కోరుకుంటుందో కూడా మన నాయకులు ఇప్పటి వరకు తెలియకపోవటం ఆశ్చర్యంగా ఉందని రాజకీయ మేథావులు అంటున్నారు.
అడ్డదారుల్లో తెచ్చిన బిల్లు ను పెడితే.. ఇలా జరుగుతుంది. ఇరుప్రాంతాల తెలివైన నాయకులారా.. ఇప్పటికి జరిగిన నష్టం చాలు.. ఇకనైన మేల్కోండి. సమస్య పై సమరస్యంగా మాట్లాడుకోని, విడిపోయి కలిసి ఉండండి? లేదా.. సమైక్యంగా ఉండి.. అభివ్రుద్ది చేసుకోండి? అంతేగానీ.. మన పెద్దలు కష్టపడి తెలుగుజాతికి తెచ్చిన పరువును.. పార్లమెంటులో తీయ్యకండని తెలుగుప్రజలు అడుగున్నారు.
లోక్ సభలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టినందుకు.. తెలంగాఱ తెలుగుదేశం పార్టీ నేతలు .. స్వీట్లు పంచుకున్నారు. కానీ ఆ తీపి కొద్ది నిమిషాల్లో మాయమైపోయింది. ‘‘కాంగ్రెస్ పార్టీ తలచుకుంటే.. కోయిలా చేత .. కాకిలా కారుకూతులు కూయించగలదు, అదే కాకి చేత కోయిలలా పాడించగలదు. ’’
ఇలాంటి విద్యాలు నేర్చిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నరని బీజేపి నాయకులు బహిరంగంగానే అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more