Telangana bill vs rajya sabha hamid ansari

Rajya Sabha Hamid Ansari, Telangana-Bill, congress party, Chairman Hamid Ansari, Lok Sabha, Rajya Sabha, sonia gandhi.

Telangana-Bill vs Rajya Sabha Hamid Ansari

టి.బిల్లు ముహూర్తం మారుతుందా?

Posted: 02/11/2014 09:31 AM IST
Telangana bill vs rajya sabha hamid ansari

తెలంగాణ బిల్లు ముహూర్తం  మారుతుందా అంటే  అవుననే అంటున్నారు.. రాజ్య సభ చైర్మన్  హమీద్  అన్సారీ.    తెలంగాణ బిల్లు   లోక్ సభలో పెట్టుకుండా.. రాజ్యసభలో  పెట్టొచ్చా? అనే అనుమానం  హమీద్ అన్సారీకి రావటంతో   టి-బిల్లుకు తాత్కాలిక బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నట్లు  రాజకీయ వర్గాలు అంటున్నాయి.  

తెలంగాఱణ బిల్లు ఆమోదాన్ని రాజ్యసభ నుంచే నరుక్కొద్దామనుకున్న అమ్మ ఎత్తుగడపై  అన్సారీకి  అనుమానం  రావటంతో..  న్యాయశాఖ అభిప్రాయాన్ని అడిగినట్లు  సమాచారం. దీంతో అధిష్టానం  రాజ్యసభలో ప్రవేశపెట్టే  ముహూర్తం  మారే అవకాశమున్నట్లు    సీమాంద్ర నాయకుల్లో  జోరుగా ప్రచారం మీడియా వర్గాలు అంటున్నాయి. 

ఈరోజు  రాజ్యసభలో 12 గంటల తర్వాత  తెలంగాణ బిల్లును  ప్రవేశపెట్టానికి  అవకాశముందని  కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ  బిల్లును  మొదటగా  రాజ్యసభలో  ప్రవేశపెట్టే విషయంలో  చైర్మన్  అమీద్  అన్సారీకి సందేహం  రావటంతో  .. ఆర్థిక అంశాలతో కూడిన బిల్లును లోక్ సభలో  పెట్టకుండా  రాజ్య సభలో నేరుగా పెట్టొచ్చా? అనే అంశంపై   అన్సారీ  సందిగ్థంలో పడ్డారు. ఇదే విషయంపై  వెంటనే   న్యాయశాఖను లిఖితపూర్వకమైన వివరణ  ఇవ్వాలంటూ   అన్సారీ  ఆదేశాలిచ్చినట్లు .. మీడియాలో వార్తలు వస్తున్నాయి.  దీంతో  సీమాంద్ర నేతలు, సమైక్య వాదులకు ఆశ పుట్టినట్లు  తెలుస్తోంది.  

రాజ్యసభ ఛైర్మన్ అన్సారీ అడిగిన ప్రశ్నతో టీ.బిల్లు ముహూర్తం మారే అవకాశాలున్నట్లు కనపడుతుందని  కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకులు అంటున్నారు.  ఒకవేళ సోనియా గాంధఈ  హవా నడిస్తే బిల్లు ప్రవేశానికి న్యాయశాఖ అనుకూలంగా సమాధానం ఇచ్చినట్లైతే అన్సారీ ఆమోదంతో టీ.బిల్లు అనుకున్న సమయానికే రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చునని కూడా కాంగ్రెస్ పెద్దలే అంటున్నారు.

కానీ అన్సారీ అనుమానించినట్లు రాజ్యసభలో పెట్టడం నిబంధనలకు విరుద్ధమని భావిస్తే మాత్రం బిల్లును మొదటగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాశలు అయ్యే పరిస్థితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  అసలు తెలంగాణ  బిల్లును  ముందుగా  రాజ్యసభలో  యూపీఏ ప్రభుత్వం ఎందుకు పెడుతుంది?  అనే అనుమానం అందరికి వచ్చి ఉంటుంది.  కానీ ఇక్కడే ఒక రహస్యం దాగి ఉందని ..రాజకీయ విశ్లేషకులు అంటున్నారు

రాజ్యసభలో సీమాంద్రనేతలు  చాలా తక్కువుగా  ఉంటారు కాబట్టి.  ముందుగా రాజ్యసభ లో తెలంగాణ బిల్లును ఆమోదం  పొందేలా చూడాలని  కాంగ్రెస్ పార్టీ చూస్తుందని   సీనియర్ నాయకులు అంటున్నారు.  అంతేకాకుండా  ఒకవేళ  రాజ్యసభలో బిజెపి కాదన్నా ఇతర పార్టీల మద్దతుతో బిల్లును పాస్ చేయించొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. 

ఆ తర్వాత లోక్‌సభలో బిజెపి దిగిరాక తప్పదని ఆ పార్టీ ఆలోచిస్తోందని కొందరు నేతలు చెబుతున్నారు. ఇప్పుడు నిబంధనలు అడ్డొచ్చి బిల్లును లోక్‌సభలోనే మొదట పెట్టాల్సి వస్తే బిజెపి మాట వినక తప్పని పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడుతోదని  రాజకీయ పండితులు అంటున్నారు. 

తెలంగాణ బిల్లు పై అన్సారీకి అనుమానం పై యూపీఏ ప్రభుత్వం ఎలా సమాధానం చెబుతుందో చూద్దాం. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles