కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి రాజీనామా పై.. ఆందోళనలు జరుగుతున్నాయి. సమైక్యాంద్ర కోసం కేంద్ర మంత్రి గా ఉన్న చిరంజీవి ఏం చేశారు అనే దానికి .. సీమాంద్ర ప్రజలు , సమైక్యవాదులు మండిపడుతున్నారు. అయిన మంత్రి చిరంజీవి రాజీనామా చేస్తే తెలంగాణ ఆగిపోతుందా? తెలంగాణ సమస్య ఏమైన.. ఈరోజు, నిన్న పుట్టిందా? తెలంగాణ సమస్యకు అరవైఏళ్ల చరిత్ర ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది చిరంజీవి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేయటం మంచిది కాదు.
ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీలో.. మర్రి ఊడల మాదిరి..బలిసిపోయిన సీమాంద్ర నాయకులు చాలా మంది ఉన్నరని సీమాంద్ర ప్రజలకు, సమైక్యవాదులకు తెలుసు. తెలంగాణ సమస్యపై క్షుణ్ణంగా తెలిసిన.. మహా మేథావులు సీమాంద్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్నవిషయం మరిచిపోతే ఎలా? గత రెండు మూడేళ్ల నుంచి రాజకీయల్లో చిరంజీవి పేరు తరచుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అంతమాత్రనా .. ఆయన సీమాంద్ర కు ఏదో భారీఎత్తు నష్టం చేస్తున్నరని.. ఆయన ఇంటి వద్ద ధర్నాలు, రాస్తారోకోలు, పరుషాపదజలంతో విమర్శలు చేయటం మంచికాదని ఆయన అభిమానులు అంటున్నారు.
120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో.. కేంద్ర మంత్రి చిరంజీవి ఒక పొద్దుతిరుగుడు పువ్వులాంటి వాడు. రాష్ట్ర ప్రజలకు మేలు చెయ్యాలని రాజకీయల్లోకి వచ్చి, స్వార్థ రాజకీయ నేతలను నమ్మి , నిలువున మోసపోయిన మేకప్ వేసుకొని సహజ మనిషి చిరంజీవి. నడిసముద్రంలో మునిగిపోతున్న.. హాస్తాన్ని.. రాష్ట్ర ప్రజల శ్రేయోస్సుకోరకు తన అభయహస్తంతో పార్టీని నిలబెట్టి , రాజకీయ పదవి కోసం .. 365 రోజులు సహనంతో ఎదురుచూసిన.. సామాన్య జీవి చిరంజీవి.
రాజకీయ వ్యూహాలు రచించటం చిరంజీవికి తెలియదనే ..విషయానికి .. ఆయన సహనమే..నిదర్శమని..కాంగ్రెస్ పెద్దలే..అనేక సార్లు చెప్పుకొని..సిగ్గుతో తలదించుకున్న చాలా ఉన్న విషయం తెలిసిందే. అందరితోపాటే ఆయన కూడా.. సమైక్యాంద్రకు జై అన్నారు. అవసరమైతే.. రాజీనామా చేయ్యటానికైన ..నేను సిద్దమే అని.. అనే సార్లు మీడియా ముందు గొంతుచించుకోని చెప్పిన విషయం తెలిసిందే.
గత పదేళ్ల నుండి రాజకీయ పదవులు అనుభవిస్తూ, అడ్డదిడ్డంగా సంపాదించిన, సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు ఎందుకు రాజీనామ చెయ్యలేదు? అంటే సమాధానం చెప్పే ఒక్క సమైక్య నాదుడే లేడని విషయం ప్రతిఒక్కరికి తెలుసు. ‘‘అయిన ఏనుగును వదిలిపెట్టి.. చీమ ను పట్టుకుంటే పలితం ఉంటుందా చెప్పండి? నేనేదో.. మంత్రి చిరంజీవి మీద అభిమానం తో రాయటం లేదు. కళ్ల ముందే కనిపిస్తున్న నిజాలు కాబట్టి చెప్పటం జరుగుతుంది.
సమైక్యాంద్ర కావాలని నాకుఉంది. కానీ ఏం లాభం మన నాయకులు చవట దద్దమ్మలాగ ఉండబట్టే.. ఈరోజు మనకు ఈ కర్మ పట్టిందని చెప్పగలను.
ఒకవేళ ఇప్పుడు సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు అందరు రాజీనామా చేసిన, రాష్ట్ర విభజన ఏర్పాటు ను అడ్డుకోవటం ఎవరి వల్ల కాదనే సత్యం సీమాంద్ర ప్రజలకు, సమైక్యవాదులకు తెలుసు. అయినా ఏదో కావాలనే తపనే తప్ప.. నిజంగా సమైక్యంద్ర కావాలని పోరాటం ఎవరు చేయటం లేదనే విషయం తెలిసిపోతుందని రాజకీయ మేథావులు అంటున్నారు.
అసలు ఇప్పటి వరకు.. ఒక్క సీమాంద్ర నాయకుడు గానీ, ఒక్క సమైక్య వాది గానీ, ఇందుకోసం రాష్ట్రం విడిపోకూడదని ఎవరైన చెప్పారా. లేక తెలంగాణ ప్రజలకు మేమున్నం అనే భరోసా ఒక్క సీమాంద్ర నాయకుడైన ఇచ్చాడా? తెలంగాణ ప్రజలు, తెలంగాణ నేతలు.. ప్రత్యేక రాష్ట్రం కావాలని.. అనేక కారణాలు చెబుతున్నప్పుడు.. సీమాంద్ర నాయకులు.. కలిసి ఉండటానికి .. కనీసం ఒక్క కారణమైన చెప్పారా? సమైక్యవాదులారా , సీమాంద్ర ప్రజలారా ఆలోచించండి? సమస్యకు పరిష్కారం చెప్పకుండా.. పట్టుదలకు పోయి .. పదవులకు రాజీనామలు చేయ్యండని.. సీమాంద్ర నేతల ఇళ్ల చుట్టు తిరిగి అరిచి గీపెట్టిన.. ఫలితం శూన్యం.
తెలంగాణ ఇస్తున్నం మొర్రో అని కేంద్రం ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్న సమయంలో పరిగెత్తకుండా..,పరిస్థితి చెయి దాటిపోయిన తరువాత ఎంతమంది సమైక్య పరుగులు చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి. అందుకే.. నిజంగా .. సీమాంద్ర ప్రజలకు, సమైక్యవాదులకు ఏం కావాలో తెలుసుకోని.. సీమాంద్రనేతలు అందరు కలిసి కేంద్రాన్ని డిమాండ్ చేయాలని .. రాజకీయ మేథావులు కోరుతున్నారు.
ఈరోజు కేంద్ర మంత్రి చిరంజీవికి సమైక్య సెగ తగలింది. సమైక్యాంద్రకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని చిరంజీవి నివాసం వద్ద సమైక్యాంద్ర విద్యార్థి జెఏసీ నెతలు ఆందోళనకు దిగిరు. ఈ క్రమంలో చైతన్య అనే విద్యార్థి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా , తోటి స్నేహితులు అడ్డుకున్నారు. సమైక్యాంద్రకు కట్టుబడి ఉండకపోతే మీ కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని చిరంజీవికి విద్యార్థి జేఎసీ నేతలు హెచ్చరించారు.
నిన్న వరకు మెగా అన్నయ్య అని పిలిచిన అభిమానులే ఈ రోజు .. ఇలా చేయటం సబబాబు కాదు. రాష్ట్రం విడిపోవాలని చిరంజీవి కోరుకున్నరా? రాష్ట్రం విడిపోతే చిరంజీవి వచ్చే లాభం ఏమిటి? ఆయన ఇప్పటికి రాష్ట్రం కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు. ఇప్పటివరకు సీమాంద్ర ప్రజలకు, సమైక్యవాదులకు సపోర్టుగానే మాట్లాడిన విషయం తెలుసు.
ఏరోజు చిరంజీవి తెలంగాణకు మద్దతు తెలపలేదు. అంటే మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చెయ్యలి? లేకపోతే.. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం, చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని .. బెదిరిస్తే.. సమస్య తీరిపోతుందా? చిరంజీవి రాజీనామా చేసిన ఫలితం ఉండదు.
రాజీనామాచేయకపోయిన ఎలాంటి రాజకీయ ఫలితం ఉండదు కాబట్టి సమస్యను సమరస్యంగా పరిష్కారించుకునే మార్గాన్ని వెతకాలి గానీ, ఇలాంటి ఆత్మహత్యలు, బెదిరింపు వల్ల సమస్య ఝఠిలం అవుతుందే తప్ప .. పరిష్కారం కాదని రాజకీయ మేథావులు అంటున్నారు. చిరంజీవి రాజకీయల్లో ఓనమాలు నేర్చుకుంటున్నారు అని అన్న వారే.. ఈ రోజు నోరెత్తి .. విమర్శలు చేయటం మంచిదా అని మెగా అభిమానులు అడుగుతున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more