Anna hazare flatters mamta banerjee

Anna Hazare flatters Mamta Banerjee, Social reformer Anna Hazare, West Bengal CM Mamta Banerjee, AAP Delhi CM Kejriwal, Arvind Kejriwal Jan Lokpal Bill

Anna Hazare flatters Mamta Banerjee

మమతా బెనర్జీకి అన్నాహజారే ప్రశంసలు

Posted: 02/09/2014 12:05 PM IST
Anna hazare flatters mamta banerjee

ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం పెట్టుకోనని చెప్పిన సామాజికవేత్త అన్నా హజారే ఆశీస్సులు పొందుదామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసే ప్రయత్నాలను ఎప్పిటికప్పుడు వమ్ము చేస్తూ వస్తున్నారు.  పరోక్షంగా కేజ్రీవాల్ పద్ధతిని విమర్శించే దిశగా అన్నా హజారే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రశంసలతో ముంచెత్తారు. 

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించటానికి తాను ముఖ్యమంత్రులందరికీ పంపిన 17 సూచనలను మమతా బెనర్జీ మాత్రమే అమలుపరచారని అన్నారు అన్నా హజారే. ఆమె ప్రభుత్వం ఇచ్చే బంగళాను తీసుకోలేదు.  తన తండ్రికి చెందిన ఇంట్లోనే నివాసముంటున్నారు.  ముతక చీరలు, కాళ్ళకి స్లిప్పర్లతో అతి నిరాడంబరంగా జీవనాన్ని సాగించే మమతా బెనర్జీ ప్రతి రోజూ పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారని, అటువంటి వారే దేశాభివృద్ధిని సాధించగలరని, దేశాన్ని పాలించే సత్తా ఆమెకే ఉందని అన్నారు అన్నా. 

కేజ్రీవాల్ పేరు ఎత్తకుండా, కొందరు నాయకులు ఏమీ వద్దని పైకి అంటూనే అన్నీ తీసుకుంటుంటారని అన్నా హజారే విమర్శించారు. 

ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ తో తలపడుతూ కేజ్రీవాల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి జన్ లోక్ పాల్ బిల్లు కూడా అన్నా హజారే హృదయాన్ని గెలుచుకోలేకపోయింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles