Aap connivance with congress

AAP Connivance with Congress, Aam Admi Party, Arvind Kejriwal, Vinod Kumar Binny,

AAP Connivance with Congress

ఆఆపా కాంగ్రెస్ ల కుమ్మక్కు వ్యవహారం- బిన్నీ

Posted: 01/16/2014 12:37 PM IST
Aap connivance with congress

ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు వ్యవహారమే నడుస్తోందని ఆఆపా లక్ష్మీ నగర్ శాసన సభ్యుడు వినోద్ కుమార్ బిన్నీ తీవ్ర స్థాయిలో ఆరోపించటానికి కారణం ఏమిటో సర్వ విదితమే- ఆయనకి మంత్రిత్వ శాఖలో చోటునివ్వకపోవటం. 

రాజకీయాల్లోకి వచ్చేదే నాలుగు రాళ్ళు వెనకేసుకోవటానికి.  అందుకు అవకాశం ఇవ్వకపోతే పార్టీ నాయకత్వం మీద ఆగ్రహం రాదు మరీ.  పార్టీకి లభించిన అధికారంలో కొంత మేర తమకూ వడ్డించినట్లయితేనే నాయకత్వానికి దీవెనలందుతాయి.  లేదంటే శాపనార్థాలు, ఆరోపణలు, బెదిరింపులే మరి. 

మంత్రివర్గంలోకి తీసుకోకపోతేనే బిన్నీ కినుక వహించి ఆమరణ దీక్ష చేస్తానని బెదిరించటం,  పార్టీ వ్యవహారం ముందు చెప్పినట్లుగా లేదని ఆరోపించటం, ఇతర పార్టీలు చేసినట్లుగా కాంగ్రెస్ తో కుమ్మక్కయిన అభియోగాన్ని వేయటం, ఇతర పార్టీలతో సమావేశమవటం లాంటివి చూస్తుంటే ఆఆపా అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈయనగారికి మంత్రివర్గంలోకి తీసుకుని గురుతరమైన బాధ్యతలు అప్పగించకపోవటమే మంచిదైందని అనిపిస్తోంది.

ఇలాంటి వాళ్ళకే మంత్రి పదవి లభిస్తే పార్టీ చాలా మంచిదంటారు.  ఎందుకంటే వాళ్ళకి మేసే అవకాశం లభిస్తుంది కాబట్టి.  కానీ అలా జరగకపోవటంతో ఆ పార్టీ చెడ్డదైపోయింది.  అవినీతికి ఎదురుగా నిలిచి పోరాటం చెయ్యటమే లక్ష్యంగా ఆవిర్భవించిన ఆఆపా మంత్రి పదవినిచ్చి అవినీతికి అవకాశం ఇస్తుందని ఆశించి, అది దొరకనందుకు చిర్రుబుర్రులాడుతున్న బిన్నీ లాంటి వాళ్ళని ఏరివేసిన అరవింద్ కేజ్రీవాల్ నిజంగా మెచ్చుకోదగ్గవారే.

ఎందుకంటే ఇలాంటివాళ్ళకి మంత్రిత్వ బాధ్యతలను అప్పజెప్తే వాళ్ళ అవినీతి దూకుడు ఎంతుంటుందో చెప్పలేం.  అదంతా చెయిజారిపోతున్నదనే బాధే ఎక్కువ కనిపిస్తోంది- పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బిన్నీని చూస్తే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles