అకున్ ను అంతలా ఒత్తిడి చేస్తుందెవరు? | Fully Pressure on Akun in Drug Case Inquiry

Akun sabharwal sensational comments on drug case

Telangana Excise Chief, Telangana Akun Sabharwal, Akun Sabharwal Pressure, Political Pressure Drug Case, Telangana Drug Case, Political Pressure Drug Case, KCR No Arrest Drug Case

Telangana Excise Chief Akun sabharwal sensational statement in drug case. Pressure on them to not reveal any one name in this case.

అకున్ పై అంత ప్రెజర్ ఎక్కడిది?

Posted: 07/31/2017 09:54 AM IST
Akun sabharwal sensational comments on drug case

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ చేసిన ప్రకటన ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో కొందరు సినిమా పెద్దలు, బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల పిల్లలు ఉన్నారని, అయితే వారి పేర్లు వెల్లడించవద్దంటూ తమపై ‘ఒత్తిళ్లు’ ఉన్నాయంటూ పేర్కొని కలకలం రేపాడు. ఈ కేసులో ఎవరినీ వదల వద్దని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే అధికారులకు పూర్తి అధికారం ఇచ్చినా అరెస్టులు వద్దంటూ చెప్పటం  వెనక పెద్ద తలకాయల ఒత్తిళ్లే ఉన్నట్టు తెలుస్తోంది.

పోలీసులై ఒత్తిడి తెచ్చేంత సీన్ సామాన్యులకు, సినీ పరిశ్రమకు చెందిన వారికి ఉండే అవకాశం లేదని, కాబట్టి అకున్ చెప్పిన దానిని బట్టి వ్యవస్థలో బాగా పలుకుబడి కలిగిన వారే అందులో ఉన్నట్టు చెబుతున్నారు. డ్రగ్స్ కేసులో బడా నిర్మాతల కుమారులు, ఓ పెద్ద నటుడి కుమార్తె, ఓ పత్రికాధిపతి ఉన్నట్టు చెబుతున్నా తొలి జాబితాలో వారి పేర్లను ఎక్కించలేదు. దీంతో రెండో జాబితాలోకైనా వారి పేర్లు వస్తాయా? లేక నీరు గారిపోయినట్టేనా? అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఈ కేసులో అధికారపార్టీకి చెందిన ప్రముఖ నేత కుమారుడి పేరు కూడా వెలుగులోకి రావడం పెను సంచలనంగా మారింది. రాయలసీమకు చెందిన మైనింగ్ కాంట్రాక్టర్ ద్వారా ఆయన ఎల్ఏఎస్‌డీ తెప్పించుకునేవారని సమాచారం. డ్రగ్స్ కేసులో ఉన్న ‘పెద్దల’ పిల్లలను ముట్టుకునే సాహసం చేసే ప్రసక్తే లేదని, అది అనుకున్నంత సులభం కాదని స్వయంగా అధికారులే చెబుతుండడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Drug Case  Akun sabharwal  Political Pressure  

Other Articles