Mystery unravels in Congress Youth Leader Fire Case

Vikram goud suicide drama confirmed

Vikram Goud Case, Vikram Goud Suicide Attempt, Vikram Goud Divert, Vikram Goud Case New Twist, Vikram Goud Suicide Drama, Vikram Goud Case, Vikram Goud Supari

Vikram Goud shooting case. Mystery unravels as both Vikram and Shifali gave different statements. Police file case against VIkram Goud in Suicide Drama.

ట్విస్ట్: విక్రమ్ గౌడ్ సూసైడ్ డ్రామాకు సుపారీ!

Posted: 07/31/2017 09:11 AM IST
Vikram goud suicide drama confirmed

విక్రమ్ గౌడ్‌పై కాల్పుల వ్యవహారం క్రమంగా ఓ కొలిక్కి వస్తోంది. విక్రమ్ తోపాటు భార్య షిపాలి కూడా ఫేక్ కథనాలు చెప్పినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే కాల్పులకు ఉపయోగించిన ఆయుధం విషయంలో మాత్రం సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. దాని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు విక్రమ్ ఇంటిలోకి ఆగంతకుడు వచ్చి కాల్పులు జరిపిన ఆనవాళ్లు ఏవీ లేవని నిర్ధారించుకున్న పోలీసులు, సీన్‌ను రీ కనస్ట్రక్షన్ చేసి ఇంటి బయట ఉన్న సీసీ టీవీ పుటేజీని వీడియో అనాలసిస్ సెంటర్‌కు పంపారు.

సీసీటీవీ కెమెరాలను తొలుత పరిశీలించిన పోలీసులు విక్రమ్ చెబుతున్నట్టు ఇంట్లోకి బయట వ్యక్తులు ఎవరూ రాలేదని అంచనాకు వచ్చారు. అయితే ఓ కెమెరాలో మాత్రం నల్లరంగు కారు వెళ్లినట్టు కనబడటంతో వీడియోను అనాలసిస్ సెంటర్‌కు పంపారు. ఒకవేళ ఆత్మహత్యకు ప్రణాళిక తోపాటు, బయట వ్యక్తులతో సుపారీ ఇచ్చాడా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. విక్రమ్ భార్య షిపాలీకి (లోతైన విచారణ కోసం) సీఆర్సీసీ సెక్షన్ 41 కింద నోటీసులివ్వనున్నట్టు తెలుస్తోంది. ఇంట్లో రక్తం ఎందుకు తుడిచేశారు? పని మనిషి ఏమైంది? తుపాకీ ఏమైంది? వంటి విషయాలపై దర్యాప్తు చేసిన పోలీసులు కంక్లూజన్ కు చేరువైనట్లు తెలుస్తోంది.

 

కాగా, తనకు పెద్దమొత్తంలో అప్పులు ఉన్న మాట వాస్తవమేనని విక్రమ్ గౌడ్ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అయితే ఒడిశాలో చేస్తున్న మైనింగ్ వ్యాపారంలో తనకు చాలా డబ్బులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. సోమవారం ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చే అవకాశం ఉండటంతో రేపు ఈ కేసుపై ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram Goud  Fire Case  Suicide Drama  

Other Articles

Today on Telugu Wishesh