TDP Leaders in Tension over Pawan CBN Meet

Pawan kalyan to meet cm chandrababu naidu today

Uddanam Kidney Disease, Pawan Kalyan, Chandrababu, Pawan Chandrababu Harvard Team, Uddanam Pawan CBN, CBN Pawan Harvard Team, Pawan Uddanam Symposium, Pawan Vizag Symposium, Pawan Jagan CBN, Pawan Jagan Uddanam

Janasena Chief Pawan Kalyan meet AP CM Chandrababu Naidu along with Harvard team. Pawan try to keep his promise on Uddanam kidney disease.

పవన్-బాబు భేటీ.. టీడీపీలో టెన్షన్

Posted: 07/31/2017 07:55 AM IST
Pawan kalyan to meet cm chandrababu naidu today

ఓవైపు ఉద్ధానంలో హాట్ కామెంట్లు చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాస్త గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలుసుకుంటున్న ఏం చర్చించుకుంటారో? అని డిస్కషన్లు మొదలుపెట్టేసుకున్నారు. రాజకీయాలా? లేక శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ సమస్యలతోపాటు, హార్వర్డ్ యూనివర్సిటీ బృందంతో చేయించిన సర్వేలో వెలుగు చూసిన నిజాలను చంద్రబాబు ఎదుట ఉంచే అవకాశం ఉంచుతాడా? అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి.

ఇక మొదటిది జరిగినా జరగకపోయినా.. సమస్య మూలాలను మాత్రం సీఎం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని కోరే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ ఉద్ధానంలో నిర్వహించిన అధ్యయనం అంశాలను చంద్రబాబుకు పవన్ వివరించనున్నాడు. రక్షిత మంచినీటి ప్లాంట్లు, డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపైనా చంద్రబాబుతో చర్చించనున్నట్టు చెబుతున్నారు.

 

'నేను ప్రభుత్వాలకు కాదు...ప్రజలకు సేవ చేస్తా'నని పవన్ నిన్న విశాఖపట్టణంలో జరిగిన సింపోజియంలో ప్రసంగించిన విషయం తెలిసిందే. మన తోటి మనుషులు బాధపడుతుంటే పరిష్కారం వెదక్కుండా రాజకీయాలు చేయడం దారుణమని, సమస్యను స్పష్టంగా వేలెత్తి చూపుతున్నప్పుడు దానిని పరిష్కరించకుండా విమర్శలు చేసుకుంటుండడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించాడు. తాను నిపుణుడ్ని కాదని, అయితే మనిషిగా, తోటి మనిషి కష్టంలో భాగం పంచుకోవాలని చూసే వ్యక్తినని తెలిపాడు.

ఎంతో మంది నిపుణులు, మేధావులు, పరిశోధకులు కలిసి ఈ సమస్యను పరిష్కరించలేరా? అని ప్రశ్నించాడు. ఇలాంటి సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే దానిని నివారించడం పెద్ద కష్టం కాదని పేర్కొన్నాడు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎంతో కాలంగా వేధిస్తోందని, దాని పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తే విమర్శలు చేశారని గుర్తు చేశాడు. మరోవైపు ఉద్ధానం సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ప్రతిపక్ష వైసీసీ సాయం కోరుతామన్న పవన్ ప్రకటన టీడీపీ నేతలను విస్మయ పరుస్తోంది. ప్రత్యేక హోదా పేరు చెప్పి వైసీపీకి పవన్ దగ్గరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uddanam  Kidney Disease Issue  Pawan Kalyan  

Other Articles