US Navy commander says ready to nuke China చైనాపై అనుయుద్దానికి రెడీగా వున్నాం

Us navy ready for nuclear strike on china if trump ordered

donald trump, US President, America, Navy commander, china, nuclear attack, south china sea, nuke war, US naval forces, Australian National University, Australian capital, Canberra, security conference, US Pacific Fleet, Admiral Scott Swift

The commander of US naval forces in the Pacific Ocean Admiral Scott Swift, has warned he would launch a nuclear attack against China "next week" if ordered by President Donald Trump.

చైనాపై అనుయుద్దానికి రెడీగా వున్నాం

Posted: 07/29/2017 04:17 PM IST
Us navy ready for nuclear strike on china if trump ordered

నిత్యం ప్రపంచ దేశాలను కవ్విస్తూ.. కాలుదువుతున్న చైనాపై అణుయుద్దానికైనా తాము సిద్దంగా వున్నామని సంచలన వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా..? అమెరికా ఫసిఫిక్‌ మహా సముద్ర నౌకాదళ కమాండర్‌ అడ్మిరల్‌ స్కాట్‌ స్విఫ్ట్‌. నిజమా..? అమెరికాకు చైనాకు మధ్య ఏ విషయంలో భగ్గుమందో కూడా ఆయన తెలిపారు. చైనాపై అణు దాడులకు సిద్ధమేని అగ్రరాజ్యం అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేయడమే అలస్యమని మరీ చెప్పారు.

దేశాధ్యక్షుడు అదేశాలిస్తే.. వచ్చే వారంలోనే అణుదాడులు చేయనున్నట్లు స్విఫ్ట్ చెప్పారు. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీలో నిర్వహించిన సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. ట్రంప్‌ ఆదేశాలు జారీచేస్తే చైనాపై వచ్చేవారంలో అణుదాడులు చేస్తారా? అని వేసిన ప్రశ్నకు ఆయన అవును అని బదులిచ్చారు. అమెరికా మిలటరీలో ప్రతిఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడతామని, ఇతర దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి ప్రజలను సంరక్షిస్తామని ప్రమాణం చేస్తారని అన్నారు.

ఇప్పటికే పసిఫిక్‌ మహా సముద్రంలో అంతర్భాగమైన దక్షిణ చైనా సముద్రం తమదేనని వాదిస్తూ చైనా నౌకల సంచారం కొనసాగిస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో స్విఫ్ట్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇటీవల జిబోటిలో సైనిక స్థావరం ఏర్పాటుచేయడం ద్వారా చైనా హిందూమహా సముద్ర ప్రాంత దేశాలతో కయ్యానికి కాలుదువ్వేవిధంగా వ్యవహరించింది. ఈ పరిణామం ఆయా దేశాల్లో చిచ్చుపెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో కలిసి అమెరికా పెద్దఎత్తున సంయుక్త మిలటరీ విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల ద్వారా తమ బలాన్ని చైనాతో సహా శత్రుదేశాలకు అమెరికా, ఆస్ట్రేలియా చాటిచెప్పాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles