Political Motive behind RBI Allowed Old Notes Exchange

Rbi to accept demonetised notes by dccb

RBI, RBI Old Notes Deposit, RBI DCCB, RBI Notes Exchange, Presidential Candidate Old Notes Exchange, Shiv Sena Old Notes, DCCB Shiv Sena, Shiv Sena BJP Notes Exchange, DCCB Shiv Sena RBI

RBI allows district co-operative banks to deposit old notes stockpile.Maharashtra Minister Dilip Raote had demanded that the government should allow the RBI to accept the Rs 2,271 crore lying with the DCCBs.

పాత నోట్ల మార్పిడి.. కొత్త కోణం!

Posted: 06/21/2017 01:38 PM IST
Rbi to accept demonetised notes by dccb

నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 30 రోజుల్లోగా రద్దయిన పెద్ద నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని, వీటిని ఏ రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలోనైనా జమ చేయవచ్చని ఫైనాన్స్ శాఖ ఓ అధికార నోటిఫికేషన్‌ వెలువరించింది. ఈ బ్యాంకుల ఖాతా క్రెడిట్ ద్వారా నోట్ల మార్పిడి విలువను తిరిగి పొందవచ్చని సూచించింది.

అయితే ఈ సదుపాయం కేవలం డిస్ట్రిక్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకులకు మాత్రమే కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం నవంబరులో రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లు తమ వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్నాయని వాటిని మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని పోస్టాఫీసులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొరపెట్టుకున్నాయి. దీంతో వాటిని మార్చుకునేందుకు మరో అవకాశాన్ని ఇస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.

కాగా, నోట్ల రద్దు తరువాత కో-ఆపరేటివ్ బ్యాంకులు కూడా పాత నోట్లను డిపాజిట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై రద్దు గడువు ముగిసిన తరువాత కూడా ఆర్బీఐకి జమ చేయకుండా మిగిలిన నోట్లు వందల కోట్లు ఉన్నాయని విన్నవించుకుంది. తక్షణమే వీటిని మార్చకుంటే, రైతు రుణాలకు ఇబ్బందులు కలుగుతాయని బ్యాంకు యాజమాన్యాలు ఆర్బీఐకి మొరపెట్టుకున్నాయి. అయితే గతంలో ఇదే ప్రతిపాదనను ఆర్బీఐ నిరాకరించింది.

సుమారు 2,500 వేల కోట్ల పాత నోట్లు మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకుల్లో అలాగే ఉండిపోయాయని శివసేన గళం ఎత్తింది. మంత్రి దిలీప్ రౌతే కూడా ఈ విషయంలో కేంద్రానికి లేఖ కూడా రాశాడు. అయితే రాష్ట్రపతి అభ్యర్థికి ఉద్ధవ్ థాక్రే మద్ధతు ప్రకటించటం, ఆ వెంటనే నోట్ల మార్పిడికి వెసులు బాటు కల్పిస్తూ ఆర్థిక శాఖ నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  DCCB  Old Notes Deposits  Shivsena  

Other Articles