TDP MLA Jaleel Khan Hillarious statements at Iftar party నవ్వులు పూయించిన జలీల్ ఖాన్.. నిగూఢం వేరయ్యా..!

Tdp mla jaleel khan hillarious statements at iftar party

TDP MLA Jaleel Khan, Vijawada west MLA Jaleel Khan, MLA Jaleel Khan Hillarious statements, jaleel Khan Iftar party, AP Chief Minister, Chandrababu, TDP MLA, Jaleel Khan, Vijawada west, Hillarious statements, Iftar party, AP CM, Chandrababu

TDP MLA Jaleel Khan from Vijawada west once again makes Hillarious statements at Iftar party in the presence of AP Chief Minister Chandrababu

నవ్వులు పూయించిన జలీల్ ఖాన్.. నిగూఢం వేరయ్యా..!

Posted: 06/21/2017 12:30 PM IST
Tdp mla jaleel khan hillarious statements at iftar party

ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పేరు వినగానే అందరకి ఠక్కున గుర్తుకువచ్చేది కామర్స్ లో ఫిజిక్స్.. కామర్స్ లో మ్యాథ్స్.. వైసీసీ పార్టీ నుంచి గెలిచిన ఆయన పార్టీని వీడి అధికార పార్టీలో చేరి పసువు పచ్చ కండువాను ధరించగానే. అమాత్యుడి పదవి కోసం ఎదరుచూశారు. తీరా పదవి దక్కుతుందన్న నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన నిజాలు.. ఆయనను చాలా పాపులర్ చేశాయి. ఎంతగా అంటే మైనారిటీ శాఖ వ్యవహారాల శాఖ మంత్రిగా పదవిని అందుకోవాల్సిన ఆయనను దానికి దూరం చేసేంతగా.. అయన వీడియో చూడని తెలుగు రాష్ట్రాల ప్రజలు లేరు.

అంతేకాదు ఆయన వీడియో ఎంత పాపులర్ అయ్యిందంటే ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారందరూ ఆయన బీకాంలో ఫిజిక్స్ కు బోల్డ్ అయ్యారంటే అతిశయోక్తి కాదు. అలాంటి జలీల్ ఖాన్ మళ్లీ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షిగా మళ్లీ నవ్వులు పూయించారు. తన విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రంజాస్ ఉపవాసల దీక్షను పరస్కరించుకుని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి చంద్రబాబు కూడా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికి టోప్ ధరింపజేశారు.

అంతా అయ్యాక ముస్లిం సోదరులను ఉద్దేశించి జలీల్ ఖాన్ మాట్లాడిన మాటలు అక్కడున్న వారందరినీ నవ్వులో ముంచాయి. తన జీవితాన్ని తమరే నిర్ణయించాలని, వేరేవాళ్ల చేతుల్లో పెట్టవద్దని చంద్రబాబును జలీల్ ఖాన్ సరదాగా అన్నారు. దీంతో, చంద్రబాబు సహా అక్కడున్నవారంతా సరదాగా నవ్వుకున్నారు. ఆ తరువాత జలీల్ ఖాన్ వ్యాఖ్యలను విశ్లేషించిన రాజకీయ వేత్తలు జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి చేసినవా..? లేక చిన్నబాబు నారా లోకేష్ ను ఉద్దేశించి చేసినవా..? అన్న విషయంలో నిగూఢాన్ని కనిపెట్టే పనిలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP MLA  Jaleel Khan  Vijawada west  Hillarious statements  Iftar party  AP CM  Chandrababu  

Other Articles