comedian house vandalised by villian హస్యనటుడు ఇంటిపై దాడి చేసిన విలన్..

Comedian dv naidu house vandalised by movie villian

comedian house vandalised by villian, Tollywood, comedian, DV naidu, house vandalised, Ramu, jubliee hills police station, nene raju nene manthri movie villan ramu, crime

Tollywood comedian DV naidu house vandalised by nene raju nene manthri movie villan ramu along with his men. Naidu approched police and alleged that ramu and his men even assaulted his family ladies.

హస్యనటుడు ఇంటిపై దాడి చేసిన విలన్..

Posted: 06/21/2017 01:40 PM IST
Comedian dv naidu house vandalised by movie villian

సినిమా నటులు తమకు కొంత పాపులారిటీ రాగానే తెరపైనే కాకుండా వారు నిజనిజజీవితాల్లోనే అవే పాత్రల్లో జీవించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వారు ఎంచుకునే పాత్రలు సభ్యసమాజం అమోదం పోందితే తప్పులేదు కానీ.. సభ్య సమాజం తలదించుకునే పాత్రలలో వారు జీవిస్తేనే వార్తల్లో నిలుస్తారు. సరిగ్గా అలాంటి చర్యలకు పూనుకున్నారు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే విలన్ గా రాణిస్తున్న రాము. నిజజీవితంలోనూ తాను విలన్ అన్న దోరణిలో వ్యవహరించి వార్తల్లోకి ఎక్కాడు.

హాస్యనటుడు డివి నాయుడితో ఆయనకు ఏం విబేధాలు వున్నాయో తెలియదు కానీ.. ఆయన ఏకంగా నాయుడు ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. ఇవాళ ఉదయం నాయుడు ఇంటికి వెళ్లి మరీ ఇంట్లోని వస్తువులను ధ్వసం చేశాడు. ఆయనతో పాటుగా అతని గ్యాంగ్ కూడా నానా రభస సృష్టించారు. ఈ మేరకు డివి నాయుడు స్థానిక జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన గ్యాంగ్‌తో దాడి చేయడమే కాక తమ కుటుంబానికి చెందిన మహిళల పట‍్ అసభ్యంగా ప్రవర్తించారని ఆయన ఫిర్యాదులో పేర్కోన్నాడు. అకారణంగా తన ఇంటిపై దాడి చేసి వీరంగం సృష్టించాడని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస‍్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  comedian  DV naidu  house vandalised  Ramu  jubliee hills police station  crime  

Other Articles