JC Diwakar Reddy Comments on Nishit Naraya Death

Jc comments on narayana son death

JC Diwakar Reddy, JC Diwakar Reddy Nishit Narayana, JC on Narayana Son Death, Narayana Son Death, Narayana Son Nishit, Nishit Narayana Family, Nishit Narayana Death, Anantapur MP JC Diwakar Reddy Comments, Nishit Narayana Death JC Comments

Anantapur MP JC Diwakar Reddy Sensational Comments on Minister Narayana's Son Nishit Narayana Death.Parents should avoid children's luxurious life.

నిషిత్ మృతిపై జేసీ సంచలన వ్యాఖ్యలు

Posted: 05/10/2017 12:35 PM IST
Jc comments on narayana son death

నిండా పాతికేళ్లు కూడా లేని నిషిత్ నారాయణకు నూరేళ్లు నిండిపోవటంపై అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారు వేగం చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువలో తక్కువ గంటకు 200 కిలోమీటర్ల పైన వేగంతో కారు ప్రయాణించి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారు డ్యామేజ్ ను పట్టి మెట్రో ఫిల్లర్ ను ఎంత వేగంగా ఢీ కొట్టిందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

 ఇది కూడా చదవండి... మంత్రి నారాయణకు పుత్ర శోకం

ఇక ముందుభాగం మొత్తం నుజ్జు నుజ్జు కావటమే కాదు... ప్రమాద సమయంలో ప్రాణాల్ని రక్షించే ఎయిర్ బెలూన్లు సైతం పగిలిపో్యాయి. ప్రస్తుతం మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు నేతలు, ప్రముఖుల పరామర్శలు సాగుతున్నాయి. కేవలం అతి వేగమే వాళ్ల ప్రాణాలు తీసిందని వైద్యులు ధృవీకరించారు. యాక్సిడెంట్ అయిన పది నిమిషాల లోపే వాళ్లు ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే నిషిత్ నారాయణ మృతి నేపథ్యంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

నేతల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగిపోయిందంటూ కామెంట్ చేశాడు. కల్చర్ పేరిట ధనవంతుల పిల్లలు పబ్బులు, బార్లకు వెళ్తున్నారని, తప్పతాగి రోడ్ల మీద పడి ప్రాణాలు గొట్టుకుంటున్నారని ఆయన ఆక్షేపించాడు. యువకులు, వంశాన్ని ఉద్దరిస్తారని భావించిన యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త జీర్ణించుకోవడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. యువకులు జాగ్రత్తగా ఉండాలని, అందుకు సమయం లేదనే సాకు చెప్పకుండా తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాలని ఆయన సూచించాడు. ప్రభుత్వాలు కూడా కేవలం ఆదాయం కోసం చూసుకోకుండా రాత్రి 11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలని సూచించాడు. అయితే పోస్ట్ మార్టంలో వైద్యులు నిషిత్, రవివర్మ మద్యం సేవించి లేరని చెప్పటం తెలిసిందే.

 

నిషిత్ కు కొత్తేం కాదు... 

అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే, అతివేగంగా కారు నడపడం నిషిత్ కు ఇదేమి తొలిసారి కాదని, గతంలో కూడా ఇదే విధంగా కారు నడిపాడని, ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారని సమాచారం. ఈ ఏడాదిలోనే అతివేగంగా కారు నడిపినందుకు నిషిత్ మూడు సార్లు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. తొలిసారి జనవరి 24, 2017న గండిపేట వద్ద 150 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ గన్ కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత, మార్చి 1న మరోమారు గండిపేట వద్ద అంతే వేగంతో కారు నడుపుతూ, మార్చి 10న మాదాపూర్ ఔటర్ రింగ్ రోడ్ లో అతివేగంగా కారు నడిపినట్టు ట్రాఫిక్ పోలీసుల సమాచారం. ఆయా సందర్భాల్లో 150 కిలో మీటర్లకు తక్కువ కాకుండా వేగంతో నడిపినట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC Diwakar Reddy  Anantapur MP  Nishit Narayana Death  

Other Articles