Jayalalithaa will with Deepak Jayakumar

Deepak jayakumar on jayalalithaa properties

Jayalalithaa Will, Amma Will, Jayalalithaa Assets, Jayalalithaa Properties, Deepa Jayakumar and Deepak Jayakumar, Deepak Jayakumar Jayalalithaa Properties, Amma Will With Deepak Jayakumar, Jayalalithaa Successor, Jayalalithaa Real Will, Jayalalithaa Will Papers

Jayalalithaa Niece says Amma will With Me only. Jayalalithaa left her properties to Deepa and Deepak Jayakumar.

జయ ఆస్తులపై నాకు మాత్రమే హక్కుంది

Posted: 05/10/2017 12:58 PM IST
Deepak jayakumar on jayalalithaa properties

తన మేనత్త, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన వీలునామా తన దగ్గర ఉందని సంచలన ప్రకటన చేశాడు మేనల్లుడు దీపక్ జయకుమార్. ఆమె వీలులో ఆస్తులన్నీ తనతోపాటు, తన సోదరి దీప జయకుమార్ పేరిట రాసి ఉందని చెబుతున్నాడు.

‘మా అత్త జయలలిత రాసిన వీలునామా నా దగ్గరే ఉంది. అన్ని ఆస్తులూ నా పేరిట, నా సోదరి దీప పేరిట రాసి ఉన్నాయి’ అంటూ దీపక్‌ చేసిన ప్రకటన తమిళనాడులో తీవ్ర చర్చకు కారణమైంది. వీలునామా ప్రకారం చెన్నై పోయెస్‌ గార్డెన్‌ లోని బంగ్లా, చెన్నై పార్సన్‌ మేనర్‌ లోని రెండు కార్యాలయాలు, సెయింట్‌ మేరీస్‌ రోడ్డులోని నివాసం, కొడనాడు ఎస్టేట్‌, హైదరాబాద్‌ లోని ద్రాక్షతోట తదితర ఎనిమిది ఆస్తులు తనకు దక్కుతాయని దీపక్ జయకుమార్ వెల్లడించారు. ఇంతకు ముందు అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు న్యాయస్థానం విధించిన జరిమానాను తానే కడతానని ప్రకటించాడు దీపక్. తాజాగా వీలునామా ప్రకటనతో మరో సంచలనానికి తెరతీశారు.

జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో పలు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కొడనాడులోని జయలలిత ఎస్టేట్‌ బంగ్లాలో హత్య, దోపిడీ జరిగింది. ఈ సందర్భంగా జయలలిత ఆస్తుల వివరాలు, పార్టీకి సంబంధించిన కీలక పత్రాలు, భారీ ఎత్తున డబ్బు ఉందని, అందుకే అక్కడ హత్య దోపిడీ చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వినబడుతుండగా, కేవలం డబ్బు కోసమే ఆ దోపిడీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  Properties  Deepak Jayakumar  

Other Articles