PIA pilot invites woman into cockpit కాక్ పిట్ లో మహిళతో పైలెట్ ఏకాంత సేవ

Pia pilot taking chinese passenger into cockpit goes viral

pakistan international airlines, pia, pakistan pilot, pakistan pilot, pilot-cockpit, chinese woman-cockpit, pilot, chinese woman, passengers' lives, pakistan airlines, pilot sleeps, pakistan pilot allows chinese woman into cockpit, pakistan international airlines, pia, pilot, cockpit, chinese woman, pilot sleeps, pakistan

A Pakistan International Airlines (PIA) pilot reportedly left the flight deck to invite a young Chinese woman to join him in the cockpit

పైలట్ కక్కుర్తి.. కాక్ పిట్ లోకి మహిళ.. గాల్లో ప్రయాణికులు ప్రాణాలు

Posted: 05/10/2017 10:58 AM IST
Pia pilot taking chinese passenger into cockpit goes viral

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో చోటుచేసుకుంటున్న సీనియర్ పైలట్, పైలట్ అసోసియేషన్ అధ్యక్షుడు తన విమానంలోకి మూడు వందల మంది ప్రయాణికుల ప్రాణాలను తన నిద్రకోసం ఫన్నంగా పెట్టిన ఘటన ఇంకా పాకిస్థాన్ విమానయాన శాఖకు కుదిపేస్తున్న క్రమంలో మరో ఘటన చోటుచేసుకోవడం ప్రయాణికులలో భాయందోళన కలిగిస్తుంది. ఇలాంటి వరుస ఘటనలతో విమాన ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన పీకే-853 విమానం ఇస్లామాబాద్ నుంచి బీజింగ్ వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. కాసేపటికి విమానం గాల్లో వుండగా, ఓ చైనాకు చెందిన మహిళను చూసి పైలట్ కక్కుర్తి పడ్డాడు. ఇంకేముంది.. అమెతో టచ్ లోకి వచ్చిన పైలట్.. అంతా మాట్లాడేసుకున్న తరువాత కాసేపటికే... కాక్ పిట్ లోని సిబ్బందినందరినీ బయటకు వెళ్లాలని అదేశించాడు.  వెళ్లమన్న వారిని కూడా బలవంతంగా బయటకు పంపేసిన పైలట్, చైనాకు చెందిన ఒక ప్రయాణికురాలిని కాక్‌ పిట్‌ లోకి రప్పించుకుని ఏకాంత సేవలో నిమగ్నమయ్యాడు.

అయతే అమెతో ఏకాంత సేవ చేస్తున్నంత సేపు కూడా విమానం గాల్లో వుందన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. విమానం గాల్లో ఉండగా, వారిద్దరూ ఏకాంతంగా మైకంలో తేలిపోయారు. రెండు గంటల తర్వాత... విమానం ల్యాండ్ అయ్యాక కానీ ఆ ప్రయాణికురాలు కాక్ పిట్ నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. ఎయిర్ లైన్స్ నిబంధనల ప్రకారం కాక్ పిట్ లోపలికి ఎవరూ వెళ్లకూడదు. కానీ పైలెట్ అనధికార మహిళను కాక్ పిట్ లోకి అహ్వానించడం అమెతో ఏకాంతంగా గడపడం ఇప్పుడు పాకిస్తాన్ లో రాజుకుంటుంది.

విషయాన్ని అలా అలా తెలుసుకన్న ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. విమానం లాండ్ అప్ కాగానే బతుకు జీవుడా అంటూ విమానాశ్రయంలోకి పరుగులు తీశారు. వెళ్లి వెళ్తగానే విమానాశ్రయ అధికారులు ఈ విషయమై పిర్యాదు చేశారు. ఇటీలే పాకిస్తాన్ విమానం ఒకటి టేకాఫ్ కాగానే పైలట్ ప్రయాణికుల ప్రాణాలను గాలికొదిలి.. బిజినెస్ క్లాస్‌లో గుర్రు పెట్టి నిద్రపోవడం కలకలం రేపిగా, దానికి తోడుగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. ప్రయాణికులు అందోళనకు గురవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan international airlines  pia  pilot  cockpit  chinese woman  pilot sleeps  pakistan  

Other Articles