Election Commission wants to ban candidates who bribe voters

Ec mulls ban on candidates charged for bribing voters

Election Commission, Bribe, Election Commission Bribe, Election Commission RK Nagar By poll, EC Ban Candidates, Election Commission Letter Government, Election Commission Letter Law Ministry, Bribing Voters India, India Bribe, Indian Voters Bribe, Election Candidates Bribe, Bribe People, EC Bribe

Election Commission to write to government for disqualification for bribing voters. Ban candidates 5-year who named in chargesheets for bribing

అదే జరిగితే ఐదేళ్లు రాజకీయాలకు దూరం

Posted: 05/01/2017 07:44 AM IST
Ec mulls ban on candidates charged for bribing voters

ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైపోయింది. ఎన్నికల వేళ ప్రజలను ప్రలోభ పెట్టేందుకు డబ్బును ఎరగా వేసే అభ్యర్థులను రాజకీయాలకు దూరం చేసేలా పావులు కదుపుతోంది. ఈ మేరకు కేంద్రం సాయం కోరుతూ చట్టంలో అవసరమైన సవరణలు చేయాలంటూ కోరింది.

తమిళ నాడులోని ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బును పంచేందుకు ప్రయత్నించిన అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థి దినకరన్ బుక్కయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో విచారణ జరిపిన పోలీసులకు సాంకేతిక పరిజ్నానాన్ని ఉపయోగించి మరీ పంచటం ఆశ్చర్యం కలిగించింది. పలు రకాల మార్గాలను ఎంచుకోవటంతో ఇకపై విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటే చేసే అభ్యర్థులు ఓటర్లను డబ్బు, ఇతర కానుకలతో ప్రలోభపెట్టినట్లు కోర్టులో చార్జిషీట్‌ దాఖలైతే సదరు అభ్యర్థులపై ఐదేళ్ల వరకు అనర్హత వేటు వేసేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరనుంది. దీనిపై న్యాయ శాఖకు లేఖ రాస్తున్నామని ఈసీ అధికారవర్గాలు తెలిపాయి.

ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో ఓటర్లకు పాల టోకన్లు, ఫోన్‌ రీచార్జ్‌ కూపన్లు, పేపర్ల చందాలు, ఖాతాల్లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్, మొబైల్‌ వాలెట్‌ పేమెంట్ల రూపంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టినట్లు ఈసీ గుర్తించింది. ఎన్నికల్లో డబ్బు దుర్వినియోగం అయితే ఆ ఎన్నికలను రద్దు చేసేలా అధికారాలు ఇవ్వాలని గతంలోనే ఈసీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఎన్నికల్లో అంగ బలం ప్రదర్శించిన సమయంలో ఈసీకి నేరుగా ఆ ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉంది. అర్థ బలం విషయంలో ఆర్టికల్ 324 ప్రకారం రాజ్యాంగ అధికారాల ద్వారా చర్యలు తీసుకోవచ్చు. అయితే వాటికి పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటితో అవసరం లేకుండానే చర్యలు తీసుకోవాలని ఈసీ భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Election Commission  Candidates  Bribe  Disqualification  

Other Articles