EC all party meet on EVM tampering అపవాదును చెరుపుకునేందుకు ఈసీ అల్ పార్టీ మీట్

Election commission to hold open challenge on evm tampering

Election Commission,EVM issue,Electronic Corporation of India,Election Commission of India,Arvind Kejriwal,all party meeting, EC news, evm, all party meet, ECIL, Evm Tampering, policitics, India news

The Election Commission will soon call a meeting of all political parties to assure them that the EVMs were tampering-proof and secured,

అపవాదును చెరుపుకునేందుకు ఈసీ అల్ పార్టీ మీట్

Posted: 04/30/2017 11:09 AM IST
Election commission to hold open challenge on evm tampering

అటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల మాత్రమే బీజేపి అధికారంలోకి వచ్చిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అరోపించడం, ఇటు పంజాబ్ ఎన్నికలలోనూ తమ ఓట్లు బీజేపి అకాళీదళ్ పార్టీలు కొల్లగొట్టాయని అరోపణలు రావడం.. వీటికి మమతా బెనర్జీ సహా కాంగ్రెస్ నేతలు కూడా వంత పాడటంతో ఇప్పుడివే అనుమానాలు అన్ని పార్టీలలో మెల్లిగా రాజుకునే అవకాశమున్న నేపథ్యంలో ఆ అపవాదును చెరుపుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నధమైంది.

ఈవీఎం అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు త్వరలోనే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టూ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ నసీం జైదీ తెలిపారు. ఈవీఎంల విషయంలో మరింత పారదర్శకతను ప్రదర్శించేందు రానున్న ఎన్నికల్లో వోటర్‌ వెరీఫైడ్‌ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్‌)ను ఉయోగించాలని భావిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలతో అల్ పార్టీ మీట్ ను ఏర్పాటు చేయనున్నట్లు అయన తెలిపారు.

ఈ అఖిలపక్షం సమావేశంలో ఈవీఎంల పనితీరును అన్ని పార్టీలకు వివరిస్తామన్నారు. అంతేకాదు ఈవీఎం మెషీన్లను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమన వివరాలను కూడా పార్టీల నేతలకు వివరిస్తామన్నారు. ఇందులో భద్రతాపరమైన, పాలనపరమైన రక్షణల గురించి స్పష్టత ఇస్తామని నజీబ్ జైదీ చెప్పారు. ఇటీవల జరిగిన ఢిల్లీ పురపాలక సంఘాల ఎన్నికలలోనూ బీజేపి భారీ అధిక్యం దక్కించుకునేందుకు కారణమైంది కేవలం ఈవీఎం మెషీన్లేనని మరోసారి అప్ నేతలు అరోపించడంతో ఈ మేరకు ఈసీ స్పష్టననివ్వనుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : election commission  evm  all party meet  ECIL  Evm Tampering  policitics  

Other Articles