Delhi BJP Chief Manoj Tiwari's House Ransacked

Delhi bjp chief manoj tiwari s house attacked

Delhi BJP Chief, Manoj Tiwari House Attack, Manoj Tiwari Ransack, Bhojpuri Actor Manoj Tiwari, MP Manoj Tiwari House Attack, Manoj Tiwari Attacked, Delhi MP House Attack, Manoj Tiwari House Attack CCTV, Delhi BJP president Manoj Tiwari, BJP Leader Manoj Tiwari, Manoj Tiwari Delhi BJP President, Actor MP Manoj Tiwari

Delhi BJP chief, MP Manoj Tiwari's North Avenue Residence Attacked. Intruders Caught On CCTV four arrested.

ITEMVIDEOS:సీసీ కెమెరాలో ఎంపీ ఇంటిపై దాడి

Posted: 05/01/2017 08:41 AM IST
Delhi bjp chief manoj tiwari s house attacked

నటుడు, ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారీ ఇంటిపై గత రాత్రి దాడి జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని ఆయన ఇంటిపై గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో విరుచుకుపడ్డారు. ఆయన ఆఫీస్ ను ధ్వంసం చేయటంతోపాటు సిబ్బందిపైనా దాడి చేశారు. సీసీ కెమెరా పుటేజీల్లో దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. కాగా, దాడి జరిగిన సమయంలో తివారీ ఇంట్లో లేడని తెలుస్తోంది.

ఘటనపై తన ట్విట్టర్ లో రాత్రి 3 గంటలకు ఈ భోజ్ పురి నటుడు ట్వీట్ చేశాడు. ఢిల్లీకి ఏం జరిగింది? ఓ ఎంపీ ఇంటికే భద్రత లేదా? అది కూడా పోలీస్ స్టేషన్ కు 100 అడుగుల దూరంలోనే... నార్త్ ఎవెన్యూ లోని నా నివాసంపై 10 మంది దుండగులు దాడి చేశారు. నా గదిలోకి వెళ్లి వస్తువులను చిందర వందర చేశారు. నా సిబ్బందిని బూతులు తిడుతూ, దాడి చేశారు. ఓ ఎంపీ ఇంటికే భద్రత లేకపోతే ఎలా? అంటూ ట్వీటాడు. అంతేకాదు ఈ ఘటనలో పోలీసుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

 

ఈ విషయంపై హోంశాఖకు ఫిర్యాదు చేశానన్న తివారీ, నిందితుల వెనుక ఎన్నది ఎవరైనా వదలిపెట్టబోనని చెబుతున్నాడు. 46 ఏళ్ల మనోజ్ తివారీ నేతృత్వంలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, దాడికి సంబంధించి ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi BJP Chief  Manoj Tiwari  House Attack  

Other Articles