Cop running hi-tech sex racket held | సీక్రెట్ సెక్స్ రాకెట్.. వెనుక ఉంది ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.

Cop arrested for aiding prostitution racket

Bangalore Cop, Cop Sex Racket, Cop Help Sex Racket, Bangalore Hi-tech Sex Racket, Karibasavaiah, Karibasavaiah Arrest, Head Constable Karibasavaiah, Prostitution Racket Cop, Cop Running Prostitution Racket

Police constable arrested on charge of helping gang run prostitution racket in Bangalore. During interrogation, it came to light that Karibasavaiah, head constable attached to the Parappana Agrahara police station, had helped them in running the racket for the past three years.

సీక్రెట్ సెక్స్ రాకెట్.. షాకింగ్ నిజాలు

Posted: 04/24/2017 03:17 PM IST
Cop arrested for aiding prostitution racket

బెంగళూరు నిన్న బయటపడిన ఓ హైటెక్ సెక్స్ రాకెట్ వెనుక షాకింగ్ వ్యవహారాలు వెలుగు చూశాయి. ఖాకీ డ్రెస్సు అండతో కక్కుర్తి పనులకు దిగిన ఓ కానిస్టేబుల్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారాన్ని అడ్డు పెట్టుకున్న అతగాడు ఎవరికీ తెలీకుండా నడిపించేది ఓ సెక్స్ రాకెట్. ఆన్ లైన్ మార్గంలో విటులను ఆకర్షించడం, పూర్తి నగదు రహిత లావాదేవీలు, స్టార్ హోటళ్లలో సకల సౌకర్యాలు... ఇది అతగాడి టాలెంట్ కి నిదర్శనాలు.

పరప్పన అగ్రహార పోలీసు స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కరిబసప్ప చేసే నిర్వాకమిది. ఇద్దరు వ్యక్తులతో డీల్ కుదుర్చుకుని, ఆపై వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటూ వారికి సహకరిస్తున్న కరిబసప్పను అరెస్ట్ చేసిన పోలీసులు, అతను పనిచేసే స్టేషన్ పరిధిలోనే ఉన్న పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.

2003 సర్వీస్ కు చెందిన కరిబసవయ్య మైకో లేఔట్ లోని ఓ ఇండిపెండెంట్ హౌస్ లో వ్యభిచారం జరుగుతోందని విశ్వసనీయ సమాచారాన్ని అందుకున్న పోలీసులు దాడి జరుపగా, సెక్స్ రాకెట్ వెనుక అతని హస్తం బయపడింది. ఈ వేశ్యా గృహంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ముగ్గురు యువతులతో పాటు స్వైపింగ్ మెషీన్లు, భారీ ఎత్తున నగదు లభ్యమయ్యాయి. డిసిప్లినరీ కమిటీ నివేదికానుసారం హెడ్ కానిస్టేబుల్ కరిబసప్పను విధుల నుంచి డిస్మిస్ చేయనున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.

ఉస్మాన్ అనే ముంబైకి చెందిన బ్రోకర్ తో బసవప్ప మూడేళ్లుగా ఈ వ్యవహారం వెలగబెడుతున్నాడు. అయినప్పటికీ ఈ తతంగం ఇంత సీక్రెట్ గా నడుస్తూ వస్తోంది. అయితే దీని వెనుక బడా బాబుల హస్తం ఉండి ఉండొచ్చని, దీనివెనుక పెద్ద ముఠానే ఉంటుందన్న అనుమాలను పోలీసులు వ్యక్తం చేస్తూ ఆ దిశగా విచారణ ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore  Prostitution Racket  Cop Help  

Other Articles