24 CRPF Personnel Die In Encounter With Maoists | మావోల దాడితో జవాన్లకు భారీ దెబ్బ.. 11 మంది మృతి.

11 crpf personnel die in chhattisgarh encounter

Sukma Encounter, CRPF Jawans Killed, CRPF Chhattisgarh Encounter, Chhattisgarh Encounter Chhattisgarh Encounter, CRPF Jawans Killed, CRPF Maoists, Maoists killed CRPF, 24 CRPF Jawans Killed

25 CRPF jawans killed in encounter with Naxals in Chhattisgarh's Sukma. The encounter with 74 battalion of Central Reserve Police Force (CRPF) was reported from Kala Pathar near Chintagufa in Sukma, the worst Maoist violence-affected district in south Bastar area of the state.

భారీ ఎన్ కౌంటర్.. 25 మంది జవాన్ల మృతి

Posted: 04/24/2017 05:34 PM IST
11 crpf personnel die in chhattisgarh encounter

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సోమవారం సుక్మా ప్రాంతంలో సీఆర్ ఫీఎఫ్ దళాలను లక్ష్యంగా చేసి జరిపిన దాడిలో 25 మంది జవాన్లు మృతి చెందారు. కాల్పుల్లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు సుక్మా అదనపు ఎస్పీ జితేంద్ర సుక్లా వెల్లడించాడు.

ఆ ప్రాంతంలో మావోయిస్టులు సంచారిస్తున్నరన్న పక్కా సమాచారంతో రిక్కీ నిర్వహించిన 74వ బెటాలియన్ కు చెందిన సీఆర్పీఎఎఫ్ దళంపై తుపాకులతో మావోలు విరుచుకుపడ్డారు. ముందు మావోలే కాల్పులు జరపటంతో ప్రతిగా జ‌వాన్లు ఎదురు దాడికి దిగారని చెబుతున్నారు. అయితే మావోయిస్టుల సంఖ్య ఎక్కువగా ఉండటం, వాళ్లు అప్పటికే అప్రమత్తం అయ్యి ఉండటంతో తమ వైపే నష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు తెలిపారు. సుమారు గంట పాటు జరిగిన ఎన్ కౌంటర్ లో జవాన్లను మట్టుపెట్టిన మావోలు వాళ్ల ఆయుధాలతోసహా ఉడాయించినట్లు తెలుస్తోంది.

సీఆర్ పీఎఫ్ జ‌వాన్ల మృతిని బ‌స్త‌ర్ డీఐజీ సుంద‌ర్ రాజు ధ్రువీక‌రించారు. మ‌రోవైపు బుర్కాపాల్‌-చింతాగుఫా ప్రాంతంలో ఏడుగురు జ‌వాన్ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయ‌ని, వారికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంద‌ని చెప్పారు. ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి రమణ సింగ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ యేడాది ఇదే జిల్లాలో ఇదే రీతిలో దాడి జరగ్గా 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

దెబ్బకు దెబ్బ తీసి తీరతాం...

చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుకుమా జిల్లాలో ఈ రోజు సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌పై మావోయిస్టులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన జ‌వాన్ల సంఖ్య 26కు చేరింది. ఈ దాడిని కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. హోం శాఖ స‌హాయ మంత్రి హ‌న్స్‌రాజ్ అహిర్‌తో మాట్లాడి, ఛ‌త్తీస్‌గ‌ఢ్ వెళ్లి ప‌రిస్థితిని స్వ‌యంగా స‌మీక్షించాల‌ని ఆదేశించారు. 26 మంది జవాన్లు మృతి చెంద‌డం జీర్ణించుకోలేకపోతున్నాన‌ని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. వారి కవ్వింపు చర్యలను సహిస్తూ ఉండాల్సిన అవసరం లేదని, దెబ్బకు దెబ్బ రుచి చూపించి తీరతాలని అధికారులతో ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. జ‌వాన్ల ధైర్యానికి, త్యాగానికి సెల్యూట్ చేస్తున్నాన‌ని అన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chhattisgarh  Sukma Encounter  CRPF Jawans Killed  

Other Articles