కంప్యూటర్ ప్రోగ్రామర్లకు బిగ్ షాక్.. స్కిల్స్ లేకపోతే ఇక అంతే... | Computer programmer not to qualify as specialty occupation.

Getting an h1 b visa to get harder as us announces new anti fraud measures

H-1B visas, H-1B Visas New Rules, H-1B Visa Indians, Computer Programmer H-1B Visa, H-1B Visa Specialty Occupation, H1B Visa System, H1B Rules Amendment

Donald Trump administration cracks down on misuse of H-1B visas with tighter norms. Computer programmer not to qualify as specialty occupation.

హెచ్-1 బీ వీసా.. ఇంకో షాక్

Posted: 04/04/2017 01:19 PM IST
Getting an h1 b visa to get harder as us announces new anti fraud measures

హెచ్ 1 బీ వీసా పై మరో కఠినమైన నిబంధనను తీసుకుంది అమెరికా. వీసా అప్లై చేసుకునే కంప్యూటర్ ప్రోగ్రామర్లకు స్పెషలైజేషన్ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే స్థానికేతరులకు అడ్డుకట్టే వేసే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో వలసవాదులు విలవిల లాడిపోతుంటే. ఇప్పుడు తీసుకున్న కొత్త నిర్ణయం ఔట్ సోర్సింగ్ పద్థతితో తక్కువ జీతాలకు వెళ్లే వారిపై కూడా పడినట్లు అయ్యింది.

నైపుణ్యం ఉన్న అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సరికొత్త నిబంధన పెట్టినట్లు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. కంప్యూటర్ ప్రోగ్రామర్ జాబ్ కోసం అప్లై చేసుకునే వారు నిపుణుల కిందకు రారని, ఆ జాబ్ కోసం సరైన వ్యక్తి అని నిరూపించుకోవాల్సి ఉంటుందని అందులో పేర్కొంది. కొన్ని కంపెనీలు నైపుణ్యత లేని వారికి తక్కువ శాలరీలు ఇచ్చి ఔట్ సోర్సింగ్ పద్దతిన తీసుకుంటున్నాయి. అలాంటి వారికి చెక్ పెట్టేందుకేనని అధికారులు చెబుతున్నారు.

కాగా, వచ్చే ఏడాదిగానూ హెచ్ -1బీ వీసాల జారీ దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభం కాగా, 2000 నిబంధనలతో కూడిన గైడ్ లైన్స్ ఇప్పటికే జారీ కాగా, జీతాలపై కూడా భారీ కోత విధించింది. ఈ ప్రభావం భారతీయులపైనే తీవ్రంగా పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : H-1B Visa  Computer Programmers  Specialty Occupation  

Other Articles