ప్రేమ పేరుతో నయవంచన.. డాన్స్ మాస్టర్ అరెస్టు Dance Master arrested on charges of raping student

Dance master arrested on charges of raping student

dance master, christiano, aerobic dance specialist, kerala, Dance teacher; dance master raped student, student, Rape, Madurai, Tamil Nadu, ernakulam sujoy, Christopher, arrest, molestation, sexual assult, sexual harrassment, crime

A 35-year-old dance master was arrested on charges of raping a 23-year-old student after promising to marry her.

ప్రేమ పేరుతో నయవంచన.. డాన్స్ మాస్టర్ అరెస్టు

Posted: 04/04/2017 11:33 AM IST
Dance master arrested on charges of raping student

నృత్యం అన్నది ఓ కళ. ఆ కళను నేర్చుకుని తాను భవిష్యత్తులో రాణించాలని కలలగన్న ఓ అమాయకురాలతో చనువు పెంచుకుని.. మాయమాటలతో లొంగదీసుకుని అత్యాచారం జరిపి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నయవంచన చేసిన ఓ డాన్స్ మాస్టర్ చివరకు కటకటాల లెక్కబెడుతున్నాడు. కర్ణాటక పరిధిలోని బాణసవాడి పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

స్వతహాగా భారతీయ సంప్రదాయ నృత్యమైన భరతనాట్యంలో ప్రావిణ్యురాలై.. నృత్య టీచర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఇరవై మూడేళ్ల యువతి.. తన కళకు అంతగా అదరణ లభించని నేపథ్యంలో ఏరోబిక్స్ లో కూడా చేరి దానిని కూడా నేర్చుకోవాలని బావించింది. బాణసవాడిలోని ఓ డాన్స్ స్కూల్ ఎదురుగా వున్న బోర్డును చూసి అందులోకి వెళ్లి విచారించిన పిమ్మట.. 2014లో అక్కడ ఏరోబిక్స్ క్లాసులకు వెళ్లింది. అక్కడ ఏరోబిక్స్ తరగతులను నేర్పిస్తున్న డ్యాన్స్ మాస్టర్ క్రిస్టోఫర్ తో పరిచయం ఏర్పడింది.

అయితే రెండేళ్లుగా అక్కడ డాన్స్ నేర్చుకుంటున్న కారణంగా క్రిస్టోఫర్ కి బాధితురాలికి మధ్య చనువు పెరిగింది. ఈ క్రమంలో అమెను ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని చెప్పి, గత సంవత్సరం అక్టోబరులో అమెను లోబరచుకున్నాడు. అంతేకాదు మాయమాటలు చెప్పిన క్రిస్టోఫర్ అమెపై అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు. ఆపై పెళ్లి చేసుకోవాలని నిలదీస్తే, తప్పించుకుని తిరుగుతూ.. వాయిదాలు వేస్తున్నాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు క్రిస్టోఫర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : christopher  dance master  christiano  aerobic dance specialist  kerala  madurai  tamilnadu  

Other Articles