కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలో ప్రజల చేతుల్లోకి కొత్త రూ 200 నోట్లు.. RBI gives nod to printing of Rs 200 denomination notes

Rbi gives nod to printing of rs 200 denomination notes report

rbi, reserve bank of India, note ban, rs 200 notes, new note printing press, central bank, rbi governor urjit patel, demonetisation, remonetisation

Reserve Bank of India has given its nod to printing of new Rs 200 notes. The central bank expects printing of new notes would start after the month of June later this year.

శుభవార్త: త్వరలో కొత్త రూ.200 నోటు అందుబాటులోకి..

Posted: 04/04/2017 01:03 PM IST
Rbi gives nod to printing of rs 200 denomination notes report

పాత పెద్ద నోట్లతో అవినీతి అధికంగా చోటుచేసుకుంటుందని వాటిని రద్దు చేసిన కేంద్రం అవినీతితో పాటు ఇత్యాది అనేక కారణాలను కూడా తెలిపింది. కాగా, నోట్ల రద్దు తరువాత గత ఏడాది నవంబర్ 10 నుంచి కొత్తగా అత్యంత పెద్దనోటును ప్రజల అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో అత్యంత పెద్ద నోటును తమ చేతుల్లోకి తీసుకున్న ప్రజలకు అనేక కష్టాలు ఎదురయ్యాయి.  మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా చిల్లర సమస్య ఉత్పన్నమైంది.

కొత్తగా తమ చేతుల్లోకి చేరిన రెండు వేల రూపాయల నోటు.. చూసుకుని మురవడం.. డబ్బుందని సంతోషించడం తప్పితే.. ఖర్చుపెట్టేందుకు వీలులేకుండా పోయింది. ఆ తరువాత వెనువెంటనే రూ 500 నోట్లను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ సమస్య ఎట్టకేలకు తీరింది. అయితే త్వరలో వంద నోట్లను కూడా రద్దు చేసి వాటిస్తానంలో కొత్తగా ముద్రించిన 100 నోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరోమారు చిల్లర సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటుంది.

వంద నోట్లను రద్దు చేసే ముందే..  ప్రజల అందుబాటులోకి కొత్తగా ముద్రించిన రెండు వందల రూపాయల నోటును తీసుకురానుంది. ఇందుకు ఆర్బీఐ సమ్మతి కూడా తెలిపిందని సమాచారం. ఈ ఏడాది జూన్ మాసం తరువాత ఈ నోట్ల ముద్రణను చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు సెంట్రల్ బోర్డు అమోదం కూడా లభించిందని సమాచారం. ఈ మేరకు గత మార్చిలోనే సెంట్రల్ బోర్డు అమోదం లభించిందని.. దీంతో నుంచి ముద్రణ చేపట్టనున్నట్లు సమాచారం.

అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో పాటుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్, అర్థిక విభాగం కార్యదర్శి అన్జులై చిబ్ దుగ్గల్ లతో పాటు నలుగురు అర్బీఐ డిఫ్యూటీ గవర్నర్లుతో పాటు మొత్తంగా 14 మంది సభ్యులున్న అర్బీఐ సెంట్రల బోర్డు అమోదం లభించడంతో.. ప్రస్తుతం రెండు వందల రూపాయల నోటు డిజైన్ సహా తదితర వ్యవహరాలపై అర్బీఐ దృష్టి సారించింది. ఇది కూడా ఫైనల్ చేసిన తరువాత న్యూ నోట్ ప్రింటింగ్ ప్రెస్ కు పంపి ముద్రణ చేపట్టనున్నారు. మొత్తానికి ఈ ఏడాదిలోపు దేశ ప్రజలను కొత్తగా రానున్న రెండు వందల రూపాయల నోట్లు పలకరించనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles