సిలికాన్ సిటీ లో మరో దారుణం. మహిళలకు ఏ మాత్రం భద్రత లేదన్న విషయం మరోసారి స్పష్టమైంది. కొత్త సంవత్సరం నుంచి వెలుగు చూస్తున్న కామాంధుల వికృత చేష్టలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కమ్మనహళ్లి ప్రాంతంలో ఒంటరిగా ఇంటికి వెళ్తున్న ఓ యువతిని ఇద్దరు బైక్ పై వచ్చి అడ్డగించి, అందులో ఒకడు చెప్పుకోలేని రీతిలో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో చూశాం. అంతేకాదు బైక్ పై తీసుకెళ్లేందుకు యత్నించి కుదరకపోగా, అక్కడే పడేసి పారిపోయారు. అలాంటిదే రీసెంట్ గా మరో ఘటన సీసీ పుటేజీ ద్వారా బయటపడింది.
బెంగళూరులోని కేజీ హాలి ప్రాంతంలో బురఖా ధరించి రోడ్డుపై నుంచి వెళుతున్న ఓ యువతిపై ఒక వ్యక్తి అకారణంగా దాడి చేశాడు. కొద్దిసేపు ఆ యువతిని వెంబడించిన ఆ కామాంధుడు అనంతరం ఆమెను పట్టుకొని వేధించాడు. ముద్దుపెట్టుకుని, ఎక్కడ పడితే అక్కడ తాకాడు. పెదవులను, నాలుకను కొరికి కిరాతకంగా వ్యవహరించాడు. చివరకి ఆమెను నేలపై తోసివేశాడు.
ఆమె అరుపులకు వీధికుక్కలు పెద్దగా అరవడంతో స్థానికులు వస్తారన్న భయంతో ఆ నిందితుడు యువతిని వదిలేసి చిన్నగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన అంతా అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయింది. కాసేపటికి అటుగా వచ్చిన కొందరు ఆమెను గమనించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతి కాళ్లు, చేతులు, నాలుకకు తీవ్రగాయాలు కావడంతో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ మృగాన్ని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు. కాగా, వేధింపుల తర్వాత పోకిరీలకు గట్టి వార్నింగ్ ఇచ్చినప్పటికీ శుక్రవారం ఈ దాడి జరగటం కలకలం రేపుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more