చర్చిలో మార్ర్మోగిన శివ పంచాక్షరీ మంత్రగానం.. గణపతి స్త్రోత్తం OM NAMAH SHIVAYA celebrated in Russian Church

Om namah shivaya celebrated in russian church

Russian Church, Panchakshari Mantram, vinayaka shotram, Russian Singer, Sati Kazanova, Om Namah Shivaya Chanted in Russian Church, Om Namah Shivaya, Russian Church, Panchakshari Mantram, vinayaka shotram, hindu news, Telugu News, Weird News, Latest News,

In a Russian Church - Om Namaha Shivaya !! She is Sati Kazanova a famous Russian pop singer who even previous performed on stage before PM Narendra Modi during his visit to Russia few months back

ITEMVIDEOS: చర్చిలో మార్ర్మోగిన శివ పంచాక్షరీ మంత్రగానం.. గణపతి స్తోత్త్రం

Posted: 01/07/2017 04:04 PM IST
Om namah shivaya celebrated in russian church

దైవం మానవ రూపంలో అంటూ మనుషుల్లోనే దైవాన్ని చూడాలని, మానవత్వాన్ని మించిన దైవత్వం లేదని కొందరు పెద్దలు చెబుతుంటారు. నిజమే.. మతం పేర హింసను సృష్టించడం కన్నా.. మారణహోమాన్ని రగల్చడం కన్నా.. దైవం అంటే అదృశ్య శక్తని, అదే మనల్ని వెనకనుండి నడిపిస్తుందని మరికొందరు అంటున్నారు. అయితే జగద్గురు షిరిడీ సాయి బాబా చెప్పినట్లు సబ్ కా మాలిక్ ఏక్ అన్నది మాత్రం వాస్తవం. ఎవరికి తోచిన రూపాల్లో వారు దైవాన్ని ధ్యానం చేస్తుంటారు. ఎవరు ఏ పేరున పిలిచినా.. ఏ గానంతో అలపించినా.. ఎంత భక్తి పారవశ్యంలో మునిగినా.. అంతా చెందే పరమాత్మ మాత్రం ఒక్కడే.

తాజాగా రష్యా పాప్ సింగర్ పతి ఖజనోవా ఈ మార్గంలోనే పయనిస్తుంది. అమె జన్మతహ మహ్మదీయురాలు. కానీ పాపులారిటీ సంపాదించిన పాప్ సింగర్ గా అమెను అనేక చోట్లకు అహ్వానిస్తుంటారు. అక్కడ అమె తన పాప్ లో తన అభిమానులను మైమర్చిపోయేలా చేస్తుంది. అమె గత ఏడాది అగస్టు 26న రష్యాలోని ఓ చర్చిలో ఆలపించిన శివపంచాక్షరీ మంత్రి ఇప్పడు నెట్ లో సంచలనంగా మారింది. మహ్మదీయురాలై వుండి రష్యా చర్చిలో పంచాక్షరీ మంత్రం ఆలపించడం...? ఇదేమిటి అనుకుంటున్నారా? కానీ ఇది నిజం.

సనాతన ధర్మంలో మహర్షులు తమను ఆశ్రయించే వారికి వారి కులాలు, మతాలు అన్న వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాల ప్రజల సమస్యలను తమ మంత్రశక్తి ద్వారా తీర్చేవారని విన్నాం. అయితే అప్పట్లో మహర్షులు చేసిన సాధన కూడా మంత్రాలే.  అందుకే మాటే మంత్రం అన్నారు. ఏకవ్యాఖ్య నిర్మాణంలో వున్న మంత్రాన్ని జపించి మహర్షులు అద్భుత శక్తులను పోందారు. వాటిని ఏళ్ల పాటు అత్యంత నిమయనిష్టలతో ఉచ్చరించి మహానుభావులయ్యారు. కొందరు ఇలా సాధన చేసి దైవాన్ని మెప్పించి దైవ సాక్ష్యాత్కారం కూడా పోందారనడంలో అతిశయోక్తి లేదు.

ఇలాంటి సాధన చేసి మరికోందరు అనేక మహిళలను సొంతం చేసుకోగలిగారు. ఏక వ్యాఖ్య మంత్రాలను పలకడం వల్ల గొప్ప శక్తి వస్తుందని తెలుసుకుందో ఏమో తెలియదు కానీ రష్యాలోని ఓ మహ్మదీయ పాప్ సింగర్ పతి ఖజనోవా ఏకంగా చర్చిలోకి శివ పంచాక్షరీ మంత్రాన్ని చెప్పించి.. గణపతి స్త్రోతాన్ని పాటలా అలపించి.. అమెతో పాటు చర్చికి వచ్చిన భక్తుల చేత కూడా ఈ మంత్రాలను పాడించి.. అందరినీ భక్తిప్రపంచంలో ఓలలాడించింది. దీంతో రష్యాలోని ఓ చర్చిలో పంచాక్షరి మంత్రం మారుమోగింది. రాక్ బ్యాండ్ ప్లేయర్ ‘ఓం నమః శివాయ’ , ‘గం గణపతయే నమః’ అని రాగయుక్తంగా ఆలపిస్తూ ఉంటే ప్రేక్షకులు తన్మయత్వంతో కోరస్‌గా ఆలపించారు. చప్పట్లు కొడుతూ, భక్తి పరవశ్యంలో మునిగితేలారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russian Church  Panchakshari Mantram  vinayaka shotram  Russian Singer  Sati Kazanova  

Other Articles