డిసెంబర్ 30 తర్వాత పాత నోట్లు కనిపిస్తే పట్టుకెళ్లిపోవటమే... | penalty for holding old notes.

Possession of old notes leads to penalty

Penalty on Old notes, Old notes Possession, old notes leads to penalty, Old Notes Crime, After December 30 Penalty, Banned Notes Penalty, Old Notes Crime In India

For Banned Notes Over Rs. 10,000, New Rules Propose Fine Of 50,000 Or Possession of Rs 10000 in Old Notes After Dec 30 May Invite Rs 50000 Penalty.

కొత్త ట్విస్ట్: పాత నోట్లపై పెనాల్టీ వేస్తారంట!

Posted: 12/27/2016 09:22 AM IST
Possession of old notes leads to penalty

నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకోనుందా?. డిసెంబర్ 30 తర్వాత పెద్ద ఎత్తున్న పాత నోట్లు ఉన్నవాళ్లకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తబోతున్నాయా? ఆర్థిక శాఖ అవుననే అంటోంది. త్వరలో తీసుకురానున్న కొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం ర‌ద్దయిన‌ రూ.500 , రూ.1000 రూపాయిల‌ నోట్లు ఎవ‌రివ‌ద్ద‌యినా రూ.10,000లకు పైగా ఉంటే దానిని క్రిమినల్ నేరంగా పరిగణించ‌నున్నారు.

ర‌ద్దయిన పెద్దనోట్లతో ప‌ట్టుబ‌డిన వారికి రూ.50 వేల జరిమానా లేదా పట్టుబడిన సొమ్ముకు అయిదు రెట్లు జరిమానా వేయ‌నున్నారు. అంతేగాక, ఈ నేరానికి పాల్పడితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పురపాలక మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో విచార‌ణ జ‌రిపించి, జరిమానాను కూడా విధించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది.

నవంబ‌రు 8కి ముందు దేశంలో మొత్తం రూ. 15.44 లక్షల కోట్ల పెద్ద‌నోట్లు చలామ‌ణీలో ఉన్న విష‌యం తెలిసిందే. వాటిలో ఈ నెల‌ 13 వ‌ర‌కు 12.44 లక్షల కోట్లు జ‌మ‌ అయినట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ నెల 30 గడువు లోపు బ్యాంకుల్లో రూ.13 ల‌క్ష‌ల నుంచి 13.5 లక్షల కోట్లు డిపాజిట్ అవుతుంద‌ని భావిస్తున్నారు. ఈ నెల 30 తరువాత రద్దయిన నోట్లను రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో జ‌మ చేసుకోవ‌చ్చు. ఇందుకు సంబంధించిన గ్రేస్ పీరియడ్ ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించనుంది. ఈ నెల 30లోపే ఈ ఉత్తర్వులను జారీ చేయాల‌ని కేంద్ర స‌ర్కారు భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  Old Notes  Penalty  After December 30  

Other Articles