వాజ్ పేయి పై ఆమె వ్యాఖ్యలు మంటపుట్టించాయి. | Aligarh mayor killed Vajpayee with her speech.

Aligarh mayor comments on vajpayee

Aligarh mayor Shakuntala Bharati, BJP Shakuntala Bharati, Shakuntala Bharati Atal Bihari Vajpayee, former PM Atal Bihari Vajpayee, Vajpayee 92 birthday, Vajpayee alive, Vajpayee death news, Vajpayee Shakuntala, Atal Bihari Vajpayee death speech

Aligarh mayor Shakuntala Bharati's speech during former PM Atal Bihari Vajpayee's birthday celebrations shocks everyone.

వాజ్ పేయి చావు వ్యాఖ్యల కలకలం

Posted: 12/27/2016 09:40 AM IST
Aligarh mayor comments on vajpayee

నోరు జారటం, ఆపై సారీ చెప్పటం అలవాటైన పనే అయినప్పటికీ పదే పదే ఆ తప్పులు గొప్పగా చేసేస్తున్నారు మన నేతలు. బీజేపీ కురు వృద్ధుడు, దేశ మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి చనిపోయారంటూ ఓ కమలం నేతే చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి.

వాజ్ పేయీ మన మధ్య లేకపోయినా ఆయన తీపి గురుతులు మన మధ్య ఉన్నాయంటూ ప్రసంగించాడు. వివరాల్లోకి వెళ్తే...మదన్ మోహన్ మాలవీయ మరియు వాజ్ పేయి పుట్టిన రోజు డిసెంబర్ 25నే. దీంతో వివిధ ప్రాంతాల్లోని బీజేపీ నేతలు వాళ్ల జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతం ఆగ్రాలో కూడా వేడుకలు జరిగాయి. దీనికి ముఖ్యఅతిథిగా అలీఘడ్ మేయర్ శకుంతల భారతి పాల్గొని ప్రసగించింది.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్న ఆమె ‘‘ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన తీపి గురుతులు మన మధ్య సజీవంగా ఉన్నాయి’’ పేర్కొన్నారు. దీంతో అక్కడ కలకలం రేగింది. శకుంతలాదేవి వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. కాసేపటికి జరిగిన తప్పు గుర్తించిన శకుంతల.. వాజ్ పేయీ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కాంక్షించారు. జరిగిన తప్పిదానికి సభికులకు క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఆమెపై విమర్శలు ఆగలేదు.

Vajpayee death

ఇక వాజ్ పేయి 92వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను ఇంటికెళ్లి కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రధాని నరేంద్ర మోదీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aligarh mayor  Shakuntala Bharati  Atal Bihari Vajpayee  

Other Articles