నోట్ల రద్దు నిర్ణయం తర్వాత పెద్ద ఎత్తున్న అక్రమలావాదేవీలు బయటపడుతున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో భారీగా నల్లధనం వైట్ లోకి మారిపోయేందుకు(మార్చేందుకు) సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అమాయకుల ఖాతాలను వాడేసుకుంటున్నారు కొందరు బ్లాక్ బాబులు. ఆ మధ్య ఓ టాక్సీ డ్రైవర్, ఓ వృద్ధుడి ఖాతాలో కోట్ల రూపాయలను జమ చేసి ఆపై నాలుక్కరుచుకున్నాయి బ్యాంకులు. ఇక ఇప్పుడు ఓ మహిళ తన ఖాతాలో డిపాజిట్ అయిన సొమ్ము గురించి ప్రధాని కార్యాలయానికి మెయిల్ పంపింది.
మీరట్ లోని మాధవపురంకు చెందిన 42 ఏళ్ల శీతల్ యాదవ్ ఓ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. ఆమె నెల జీతం 5000. అయితే ఈ మధ్య తన ఖాతాను చూసుకున్న ఆమెకు గుండె ఆగిపోయినంత పని అయ్యింది. డిసెంబర్ 18న తన జన ధన్ బ్యాంకు అకౌంట్ లో ఏకంగా 99 కోట్లు జమయ్యాయి. 8 రోజుల తర్వాత ఆమెవ విషయాన్ని గమనించగా, ఈ బిలినీయర్ గురించి మీడియాకు ఎక్కింది. సాంకేతిక కారణాలతోనే అంత పెద్ద మొత్తం ఆమె ఖాతాలో జమ అయ్యిందని బ్యాంకు అధికారులు చెప్పి వెనక్కి తీసేసుకున్నారు.
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వెళ్లాను. మినీ స్టేట్ మెంట్ తీసుకోగా, అందులో 99,99,99,394 రూపాయలు ఉన్నట్లు చూపించింది. పొరపాటున ఏ పది వేలో, ఇరవై వేలో జమ అయి ఉంటావను కోవచ్చు. కానీ, ఏకంగా వంద కోట్లు జమ అవ్వటం అంటే మాములు విషయం కాదు కదా. వెంటనే నా భర్తకి విషయం చెప్పి బ్యాంకు అధికారులను సంప్రదించాం. కానీ, వారి నుంచి స్పందన లేదు. శీతల్ జన్ ధన బ్యాంకు అకౌంట్ పైగా ప్రభుత్వ అదతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ (శారద రోడ్డు బ్రాంచ్) లో ఉండటం విశేషం.
ఆపై విషయాన్ని ప్రధాని కార్యాలయం(పీఎంవో)కి మెయిల్ చేయటం, ఆపై వాళ్లు రంగంలోకి దిగటంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ మేలో 500 రూపాయలతో శీతల్ జన్ ధన్ యోజన అకౌంట్ తీసుకుంది. ఆ సమయంలో కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలను ఆమె సమర్పించకపోవటంతో ఆమె అకౌంట్ ను హోల్డ్ లో పెట్టాం. ఆపై చిన్న సాంకేతిక సమస్యతో అంత పెద్ద డబ్బు అకౌంట్ లో ఉన్నట్లు చూపించింది అంతే. ఆమె వివరాలు సమర్పించాక సమస్య పరిష్కారం అయ్యింది. ఇప్పుడు ఆమె ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ 611 రూపాయలను మాత్రమే చూపిస్తుందని బ్యాంచ్ కో ఆర్డినేటర్ రవికాంత్ సింగ్ తెలిపాడు.
బీఎస్పీలోనూ కట్ల పాములు...
తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ అధికారుల దాడులు మరవక ముందే మరో రాజకీయ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలో భారీగా నల్లధనాన్ని అధికారులు గుర్తించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి చెందిన పార్టీ ఖాతాలో పాటు ఆమె సోదరుడు ఆనంద్ బ్యాంక్ ఖాతాలో రూ.కోట్లలో డబ్బు డిపాజిట్ అయ్యింది. దీంతో ఎన్నికలకు ముందు బీఎస్పీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది.
బహుజన సమాజ్ పార్టీ బ్యాంక్ ఖాతాలో రూ. నూట నాలుగు కోట్లు, మాయావతి సోదరుడు బ్యాంక్ ఖాతాలో రూ.కోటి నలభై మూడు లక్షల నగదు దశల వారీగా డిపాజిట్ అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోమవారం గుర్తించారు. ఢిల్లీలోని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోల్ బాగ్ బ్రాంచిలో ఈ నగదు జమ అయ్యింది. ఈడీ అధికారుల బ్యాంక్ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు డిపాజిట్లు అయిన ఖాతాలపై విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత బీఎస్పీ ఖాతాలో 102 కోట్ల నగదుకు వెయ్యినోట్లు, మిగతా మూడు కోట్లకు పాత 500 నోట్లు డిపాజిట్ చేసినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దీనిపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. మాయావతి సోదరుడు ఆనంద్‌కు నోటీసులు జారీ చేశారు. బీఎస్పీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more