దున్నపోతు ప్రతీకారం కాస్తలో మిస్ | Bull Revenge on Female bullfighter

Bull revenge on female bullfighter

Female bullfighter Lea Vicens, Bull revenge, Female bullfighter just miss, Spain Bull revenge, Lea Vicens with bull ears, French Lea Vicens

Female bullfighter Lea Vicens who sparked fury worldwide when she was pictured holding severed ears of animal she killed is smashed into the ground by beast a year later.

ఆ దున్నపోతు ప్రతీకారం తీర్చుకుందా?

Posted: 10/18/2016 08:28 AM IST
Bull revenge on female bullfighter

ఫ్రెంచ్ బుల్ ఫైటర్ లియా విసెన్స్ పేరు వింటే చాలూ జంతు ప్రేమికులు మండిపడతారు. ఎందుకంటే ఆమె చేసిన పని అలాంటిది. స్పెయిన్ జరాగోజాలోని లా మిసెరికార్డియాలో ఎల్‌ పిలార్ ఫెరియా టోర్నమెంటు పేరిట దున్నపోతులను హింసించే అతి కిరాతకమైన క్రీడ జరుగుతుంది. గుర్రం మీద స్వారీ చేసే బుల్ ఫైటర్లు దున్నపోతును నుంచి తప్పించుకుంటూ దానిని పొడిచి పొడిచి హింసిస్తారు. ఈ క్రీడలో భాగంగా 31 ఏళ్ల లియా విసెన్స్‌ గత ఏడాది గుర్రంపై స్వారీ చేస్తూ ఓ దున్నపోతును ఇలా పొడిచి పొడిచి చంపేసింది. అంతేకాకుండా ఆ దున్నపోతు చెవులను కోసి.. వాటిని గర్వంగా పట్టుకొని ఫొటో దిగింది. ఈ కిరాతకమైన ఫొటో చూసి జంతు ప్రేమికుల ఒళ్లు జలదరించింది. ఆమె తీరుపై వారు భగ్గుమన్నారు.

Bull revenge on Lea Vicens

అయితే ఈ ఏడాది మాత్రం ఆమెకు భయానక అనుభవమే ఎదురైంది. ఎందుకంటే దాదాపు చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది. గత శనివారం జరిగిన పోటీల్లో దున్నపోతును పొడిచే క్రమంలో అది చాకచక్యంగా తప్పించుకుంది. అంతేకాదు చివరికి గుర్రం మీద నుంచి లియాను కిందపడేసి కుమ్మేసింది. కాస్తుంటే అది ఆమెను పొడవబోయిదే. కానీ, కొంచెంలో కోమ్ము మిస్సయ్యింది. వెంటనే నిర్వాహకులు అప్రమత్తం ఆమెను బయటికి లాగేశారు. మొత్తానికి గతేడాది ఆమె చేసిన పనికి ఇప్పుడు ఈ దున్నపోతు మంచి బుద్ధి చెప్పిందని జంతు పరిరక్షణ ఉద్యమకారులు అంటున్నారు.

స్పెయిన్ లోని జరగోజాలో ప్రతీయేడు ఈ హింసాత్మక టోర్నమెంట్ జరుగుతుంది. ఆనందం పేరిట వందల కొద్ది మూగజీవాలను బలి తీసుకుంటారు. వాటిని క్రూరంగా పొడిచి పొడిచి చంపి ఆపై తోక, కొమ్ములను కత్తిరిస్తుంటారు. ఇక టోర్నమెంట్ లో పాల్గొనే వారి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్ లో పైరెట్ అని పేరొందిన జువాన్ జోస పడిల్లా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఒక కన్ను కోల్పోయాడు. స్పెయిన్ లో బుల్ ఫైట్ పై బ్యాన్ విధించాలన్న డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతున్న క్రమంలో ఇలాంటి హింసాత్మక క్రీడను కూడా నిషేధించాలన్న అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lea Vicens  Spain  Bull Fighter  revenge  

Other Articles