అచ్చం ఠాగూర్ సినిమా ఆస్పత్రి సీన్ లాగా... | Tiruvuru doctors treated died person

Tiruvuru doctors treated died person

Tiruvuru doctors treated death person, Tagore scene repeat in Chennai, Tagore Hospital Scene in real life, Tagore Scene in Tiruvur, Tiruvur Doctors treat died person

Tiruvuru doctors treated already died person, relatives protest.

ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది

Posted: 10/18/2016 09:00 AM IST
Tiruvuru doctors treated died person

సినిమాలు వేరు.. రియల్ లైఫ్ వేరు ఇది పాత పాట. సినిమాల్లో జరిగేవి నిత్య జీవితంలో జరుగుతున్నాయి. ఇది ఇప్పటి మాట. వెండితెర డ్రామాల నుంచి ప్రేరణ పొందటమే కాదు.. తప్పులు ఎలా చేయాలో కూడా నేర్చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఘటన కూడా అలాంటిదే. చిరంజీవి నటించిన ‘ఠాగూర్‌’ సినిమా గుర్తుందా? అందులో ఆస్పత్రి సీన్ గుర్తుంది కదా. చనిపోయి పోస్ట్ మార్టం కూడా అయిపోయిన వ్యక్తి శవాన్ని మన మెగాస్టార్ ఓ ప్రైవేట్ అస్పత్రికి తీసుకెళ్లితే... అక్కడ ట్రీట్ మెంట్ పేరుతో డాక్టర్లు చేసే హడావుడి, చిరు ఇచ్చే ఎక్స్ ప్రెషన్లు అబ్బో పిచ్చ కామెడీ గా ఉంటుంది. చివరాఖర్లో మాంచి సందేశం కూడా ఇస్తాడు. సరిగ్గా అలాంటిదే ఇక్కడో ఒకటి జరిగింది.

వివరాల్లోకి వెళ్లితే... తిరుప్పూరు కన్నగినగర్‌కు చెందిన రాసుకుట్టి (21) అనే యువకుడు ప్రేమ విఫలం కావడంతో శనివారం రాత్రి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానిక వైద్యులు ప్రాథమిక చికిత్సలందించారు. ఆపై కొన ఊపిరితో ఉన్న అతన్ని మెరుగైన చికిత్స కోసం తండ్రి మారిముత్తు, కుటుంబీకులు వాహనంలో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే మార్గంమధ్యలోనే దేహం పూర్తిగా చల్లబడిపోవటంతో చనిపోయాడని నిర్థారించుకున్నారు.

ఈలోపున ఆసుపత్రికి వచ్చేశారు. వాహనంలోని శవాన్ని దింపగానే ఆసుపత్రి సిబ్బంది పరుగున వచ్చి స్ట్రెచ్చర్ పై వేసుకుని లోపలికి తీసుకెళ్లారు. ఎలాగూ చనిపోయాడు కదా అదే విషయాన్ని చెబుతారేమో అని బంధువులంతా డెడ్ బాడీ కోసం బయట ఎదురు చూడసాగారు. కానీ, వైద్యులు మాత్రం ఓ శవానికి చికిత్స అందిస్తూ వైద్యులు చేసే హడావుడి అంతా యింతా కాదు. బయటికి వచ్చిన డాక్టర్లు నిట్టూరుస్తూ రాసు కుట్టి ప్రాణాలతోనే ఉన్నాడని, అతడికి అత్యవసర చికిత్సలందించాల్సి వున్నందున వెంటనే రూ.15 వేలు చెల్లించాలంటూ ఆసుపత్రి సిబ్బంది హడావుడి చేశారు.

చూద్దాం వీరి డ్రామా ఎంత సేపు నడుస్తుందో అనుకున్న ఓ బంధువు మెరుపు వేగంతో ఇంటికి వెళ్లి రూ.15 వేలను తీసుకొచ్చి ఆ ఆసుపత్రిలో కట్టారు. ఆ డబ్బులు ఆసుపత్రి ఖాతాలో జమ అయిన పావుగంటకల్లా డాక్టర్లు రాసుకుట్టి తండ్రి, బంధువుల వద్దకు వచ్చి సారీ తామెంతగానో ప్రయ త్నించినా అతడిని కాపాడలేకపోయామని దిగాలుగా చెప్పి లోపలికి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో రాసుకుట్టి బంధువులు దిగ్ర్భాంతికి గురయ్యారు. చనిపోయిన వ్యక్తికి ట్రీట్ మెంట్ చేయటంపై మండిపడ్డారు. బయట ధర్నా కూడా చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధ్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tiruvur  Died Person  Doctors  treatment  

Other Articles