ఒడిషా ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. 23 మంది మృతి | 23 Killed After Major Fire At Bhubaneswar's SUM Hospital.

23 killed after major fire at bhubaneswar s sum hospital

SUM Hospital, SUM Hospital Fire Accident, Bhubaneswar fire accident, SUM Hospital employees suspended, Chandrababu SUM Hospital, Modi SUM Hospital incident

19 dead in Bhubaneswar fire, short circuit likely to be reason; three SUM Hospital employees suspended.

ITEMVIDEOS:ఆస్పత్రిలో అర్థరాత్రి మరణ మృదంగం

Posted: 10/18/2016 07:15 AM IST
23 killed after major fire at bhubaneswar s sum hospital

ఒడిషాలో సోమవారం రాత్రి మృత్యు ఘటికలు మ్రోగాయి. భవనేశ్వర్‌లోని ఎస్‌యూఎంలో మంటలు చెలరేగాయి. ఈ ఘోర అగ్నిప్రమాదంలో 19 మంది అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను చుట్టుముట్టడంతో వారు కాలి బూడిదయ్యారు. ఘటనలో వందమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే వందమంది అగ్నిమాపక సిబ్బంది ఏడు శకటాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు.

ఆస్పత్రిలోని ఇతర వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. బ్రోంటో స్కైలిఫ్ట్‌లను ఉపయోగించి పై అంతస్తుల్లో ద్వారాలు, కిటికీలు బద్దలుగొట్టి అక్కడ చిక్కుకుపోయిన రోగులను బయటకు తీసుకొచ్చారు. రాజధాని భువనేశ్వర్‌లోనే అతిపెద్ద ప్రైవేట్ ఆస్పత్రి అయిన ఎస్‌యూఎంలోని డయాలసిస్ వార్డులో తొలుత మంటలు చెలరేగాయి. అవి వెంటనే ఐసీయూకు వ్యాపించాయి. భయాందోళనకు గురైన రోగులు వెంటనే ఐసీయూ డోర్లు మూసేశారు.

మంటలు చెలరేగిన వెంటనే డయాలసిస్, ఐసీయూ వార్డుల నుంచి 40 మంది రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంపై ఒడిశా ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 500 మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉన్నట్టు సమాచారం.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ నడ్డాను ఆదేశించారు. వందమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Odisha  Bhubaneswar  SUM Hospital  Fire Accident  23 Killed  

Other Articles